Just In
- 5 hrs ago
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- 7 hrs ago
రియల్మీ కొత్త ఫోన్ టీజర్ విడుదలయింది! లాంచ్ కూడా త్వరలోనే!
- 10 hrs ago
వాట్సాప్ కొత్త అప్డేట్ లో రానున్న కొత్త ఫీచర్లు! ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి!
- 12 hrs ago
శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్ ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధరలు,స్పెసిఫికేషన్లు!
Don't Miss
- News
5న తెలంగాణ కేబినెట్ భేటీ: బడ్జెట్ ఆమోదం
- Sports
కోహ్లీ.. ఆ ఆసీస్ బౌలర్లను దంచికొట్టాలి! లేకుంటే మొదటికే మోసం: ఇర్ఫాన్ పఠాన్
- Lifestyle
సెక్స్ సమయాన్ని మరికొంత ఎక్కువ సమయం కేటాయించడానికి ఈ విషయాలు చాలు...!
- Movies
Pathaan Day 9 Collections: తగ్గుముఖం పడుతున్న షారుక్ 'పఠాన్'.. 9వ రోజు వసూళ్లు ఎంతో తెలిస్తే?
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ఫోన్‌ను అయిస్కాంతానికి దగ్గరగా ఉంచితే..?
మనలో చాలా మందికి మనం వినియోగిస్తోన్న స్మార్ట్‌ఫోన్‌ల గురించి రకరకాల సందేహాలు వ్యక్తమవుతూనే ఉంటాయి. ఇప్పటికే మొబైల్ ఫోన్ వినియోగానికి సంబంధించి అనేక రకాల రూమర్స్ ప్రపంచవ్యాప్తంగా హల్‌చల్ చేస్తున్నాయి. ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్ గురించి గురించి బలంగా నాటుకుపోయిన అపోహలు వాటిలో దాగి ఉన్నా నిజానిజాలను మీ దృష్టికి తీసుకువస్తున్నాం...
Read More : మోటరోలా బెస్ట్ స్మార్ట్‌ఫోన్ కలెక్షన్!

వాటిలో నిజాలు ఎంత..?
యాప్ప్ కిల్ చేయటం ఫోన్ బ్యాటరీ బ్యాకప్ మెరుగుపడుతుందా..?
ఫోన్‌లోని యాప్స్‌ను కిల్ చేయటం వల్ల బ్యాటరీ బ్యాకప్ పెరిగే మాట అలా ఉంచితే, ర్యామ్ మేనెజ్‌మెంట్ పై ఒత్తిడి మాత్రం చాలా ఎక్కువుగా ఉంటుంది.

వాటిలో నిజాలు ఎంత..?
కెమెరాలోని ఎక్కువ మెగా పిక్సల్స్, ఇమేజ్ క్వాలిటీ పై ఏ విధమైన ప్రభావం చూపలేవు. అయితే, అధిక మెగా పిక్సల్స్‌తో చిత్రీకరింబడిన ఫోటోలను పెద్ద సైజు షీట్‌ల పై క్లారిటీతో ప్రింట్ తీసుకోవచ్చు. ఇమేజ్ క్వాలిటీ సెన్సార్, అపర్చెర్ సైజ్ వంటి అంశాలు ఫోటో నాణ్యతను రెట్టింపు చేయటంలో కీలక పాత్ర పోషిస్తాయి.

వాటిలో నిజాలు ఎంత..?
ఎక్కువ బ్యాటరీ కెపాసిటీని కలిగి ఉన్న ఫోన్, రెట్టింపు బ్యాకప్ ఇస్తుందనటంలో వాస్తవం చాలా తక్కువ. ఫోన్ ప్రాసెసర్ పనితీరుటట్టే బ్యాటరీ బ్యాకప్ ఆధారపడి ఉంటుంది.

వాటిలో నిజాలు ఎంత..?
వివిధ పరీక్షల ద్వారా రుజువైంది ఏంటంటే..? ఫోన్ ఆటోమెటిక్ బ్రైట్నస్, లైవ్ వాల్ పేపర్స్, బ్లూటత్ వంటి ఫీచర్లను టర్నాఫ్ చేయటం వల్ల కేవలం 2 శాతం మాత్రమే బ్యాటరీ బ్యాకప్ ఆదా అయ్యిందట.

వాటిలో నిజాలు ఎంత..?
ఎక్కువ కోర్‌లు ఉంటే ప్రాసెసర్ పనితీరు బాగుంటుంది..? వాస్తవం: వాస్తవానికి ప్రాసెసర్ పనితీరు బాగుండాలంటే ప్రాసెసర్ ఆర్కిటెక్షర్ అలానే ప్రాసెసర్ మల్టీత్రెడింగ్ వంటి అంశాలు బాగుండాలి.

వాటిలో నిజాలు ఎంత..?
ఫోన్ దగ్గరలో అయిస్కాంతాన్ని ఉంచినట్లయితే ఫోన్ డ్రైవ్‌లోని డేటా మొత్తం చెరిగిపోతుందిని పలురి అపోహ.ఈ అపోహ ఏమాత్రం నిజం కాదు, స్మార్ట్‌ఫోన్‌లలో ఉపయోగించే ఎస్ఎస్‌డి (సాలిడ్ స్టేట్ డ్రైవ్)లు అయిస్కాంత శక్తికి ఏ మాత్రం ఆకర్షింపబడవు. కాబట్టి ఫోన్‌లోని ఏవిధమైన డేటా చెరిగిపోదు.

వాటిలో నిజాలు ఎంత..?
సెల్‌ఫోన్ కారణంగా పెట్రోల్ బంక్‌లో ప్రమాదం ఏర్పడిన సంఘటనలు ఇప్పటి వరకు నమోదు కాలేదు. చిన్న రాపిడికి సైతం పెట్రోల్ స్పందించగలదు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని ముందస్తు జాగ్రత్తగా పెట్రోల్ బంక్ యాజమాన్యం ఈ తరహా హెచ్చరికులను జారీ చేస్తుంది.

వాటిలో నిజాలు ఎంత..?
మొబైల్ ఫోన్‌లు మెదళ్లను దహించివేస్తున్నాయా..? మొబైల్ ఫోన్‌లు కొంత మేర వేడిని ఉత్పత్తి చేస్తాయి. ఈ ప్రభావం మెదడును తాకే అవకాశ ముంది. కాబట్టి మొబైల్ ఫోన్‌ను మితంగా ఉపయోగించటం మంచిది

వాటిలో నిజాలు ఎంత..?
మొబైల్ వినియోగం క్యాన్సర్‌కు దారితీస్తుందా అనే అంశానికి సంబంధించి బలుమైన రుజువులు ఇప్పటికి దొరకలేదు. ఈ అంశానికి సంబంధించి పరిశోధనులు జరుగుతూనే ఉన్నాయి. అయితే ముందస్తు జాగ్రత్తగా సెల్‌ఫోన్‌లను అవసరం మేరకు వినియోగించుకోవటం మంచిది. ముఖ్యంగా డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్ వినియోగానికి దూరంగా ఉండాలి.

వాటిలో నిజాలు ఎంత..?
సెల్‌ఫోన్‌లను ప్యాంట్ జేబులలో పెట్టుకోవటం వల్ల వీర్యకణాల సంఖ్య తగ్గి ఆ ప్రభావం మగతనం పై తీవ్రంగా చూపే అవకాశముందని పలు పరిశోధనలు ఇటీవల హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే, ఈ పరిశోధనలకు బలం చేకూర్చే రుజువులకు సంబంధించి మరిన్ని అధ్యయనాలు నిర్వహించాల్సి ఉంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470