కూల్‌ప్యాడ్ ఫోన్ కొంటే జియో సిమ్, మార్చి 31 వరకు ఫ్రీ కాల్స్, ఫ్రీ నెట్

మార్కెట్లో కొత్తగా లాంచ్ అయిన నోట్ 3ఎస్, మెగా 3 ఫోన్‌లు డిసెంబర్ 7 నుంచి అందుబాటులోకి రాబోతున్న నేపథ్యంలో కూల్‌ప్యాడ్ సరికొత్త ఆఫర్‌ను అనౌన్స్ చేసింది.

కూల్‌ప్యాడ్ ఫోన్ కొంటే జియో సిమ్, మార్చి 31 వరకు ఫ్రీ కాల్స్,ఫ్రీ నెట్

ఈ ఆఫర్‌లో భాగంగా కూల్‌ప్యాడ్ ఫోన్‌లను సొంతం చేసుకునే యూజర్లు హ్యాపీ న్యూ ఇయర్ ఆఫ‌ర్‌తో కూడిన జియో సిమ్‌ను ఉచితంగా సొంతం చేసుకోవచ్చు. ఫోన్ తాలుకా బిల్‌ను రిలయన్స్ స్టోర్‌లలో చూపటం ద్వారా జియో సిమ్‌ను కూల్‌ప్యాడ్ యూజర్లు పొందే అవకాశం ఉంటుంది.

Read More : రూ.6,000లో నోకియా ఫోన్ సంచలనం రేపబోతోందా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అమెజాన్ ఇండియా ఎక్స్‌క్లూజివ్

రూ.6,000లో నోకియా ఫోన్ సంచలనం రేపబోతోందా..?

మార్కెట్లో కూల్‌ప్యాడ్ నోట్ 3ఎస్ ధర రూ.9,999. కూల్‌ప్యాడ్ మెగా 3 ధర రూ.6,999. డిసెంబర్ 7 నుంచి ఈ రెండు ఫోన్‌లు అందుబాటులో ఉంటాయి. ప్రముఖ ఈ-కామర్స్ అమెజాన్ ఇండియా ఈ ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించనుంది.

కూల్‌ప్యాడ్ నోట్ 3ఎస్ స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే..

లెనోవో కే6 పవర్ vs షియోమీ రెడ్మీ 3ఎస్

5.5 అంగుళాల హైడెఫినిషన్ డ్యుయల్ కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్), 1.36GHz ఆక్టా-కోర్ (MSM8929) ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యుయల్ సిమ్, 4జీ వోల్ట్ సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్, మైక్రో యూఎస్బీ పోర్ట్, యాక్సిలరోమీటర్, మాగ్నటిక్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, లైట్ సెన్సార్. వైట్ ఇంకా గోల్డ్ కలర్ వేరియంట్ లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

కూల్‌ప్యాడ్ మోగా 3 స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే..

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

5.5 అంగుళాల హైడెఫినిష్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 1.25గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్ మీడియాటెక్ (ఎంటీ6735) ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన కూల్8.0 యూజర్ ఇంటర్‌ఫేస్, 3050 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ వోల్ట్ సపోర్ట్, మైక్రో యూఎస్బీ పోర్ట్, బ్లుటూత్, యాక్సిలరోమీటర్, యాక్సిలరోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్, లైట్ సెన్సార్. ట్రిపుల్ 4జీ సిమ్ కనెక్టువిటీ (4జీ+4జీ+4జీ), కలర్ వేరియంట్స్ (గోల్డ్, గ్రే, వైట్).

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Buy a Coolpad Smartphone and Get a Reliance Jio SIM. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot