రూ.799కే నోకియా 3310...

నోకియా ఐకానిక్ ఫీచర్ ఫోన్ నోకియా 3310 ఇప్పుడు న్యూలుక్‌లో లభ్యమవుతోంది. నోకియా 3310 (2017) వర్షన్ పేరుతో మార్కెట్లో లాంచ్ అయిన ఈ డివైస్ ధర రూ.3310.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ర కాస్త ఎక్కువుగా ఉండటంతో

ఈ ఫోన్ ధర కాస్త ఎక్కువుగా ఉండటంతో నోకియా అభిమానులు సైతం ఈ ఫోన్‌‌ను కొనుగోలు చేసేందుకు ఒకటికి రెండుస్లారు ఆలోచిస్తున్నారు.

అచ్చం నోకియా 3310లా ఉండే మరో ఫోన్

అటువంటి వారి కోసం అచ్చం నోకియా 3310లా ఉండే మరో ఫోన్ మార్కెట్లో హల్ చల్ చేస్తోంది. ఈ ఫోన్ ధర రూ.799 మాత్రమే.

 

Darago 3310

నోకియా 3310కు క్లోన్ మోడల్‌గా భావిస్తోన్న Darago 3310ను నోకియా ఫోన్‌కు ఏ మాత్రం తీసుపోని విధంగా డిజైన్ చేసారు.

నోకియా 3310కు డూపు మోడల్..

నోకియా 3310కు డూపుగా భావిస్తోన్న Darago 3310ను ఒరిజినల్ హ్యండ్ సెట్‌కు ఏ మాత్రం తీసుపోలేని విధంగా ఉంటుంది. నోకియా 3310 మోడల్‌లో కనిపించే చెర్రీ షేప్ బటన్స్ ఇంకా కెమెరా కట్‌అవుట్స్‌ Darago 3310లోనూ ఉన్నాయి.

స్వల్ప తేడాలు ఉన్నాయి..

ఈ రెండు ఫోన్ల మధ్య డిజైనింగ్ విషయంలో స్వల్ప మార్పులను మనం గమినించవచ్చు. మైక్రో-యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ ప్లేస్‌మెంట్‌ను బట్టి ఈ డిజైనింగ్ మార్పును స్పష్టంగా కనిపెట్టవచ్చు నోకియా 3310 మోడల్‌లో మైక్రో-యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ ఫోన్ టాప్ భాగంలో ఉంటుంది. Darago 3310 విషయానికి వచ్చేసరికి ఫోన్ క్రింది భాగంలో ఈ యూఎస్బీ పోర్ట్ ఉంటుంది. ఇదే సమయంలో ఈ రెండు ఫోన్‌లు వేరువేరు సాఫ్ట్‌వేర్‌ల పై రన్ అవుతాయి.

 

Darago 3310 స్పెసిఫికేషన్స్..

నోకియా 3310కు క్లోన్ మోడల్‌గా భావిస్తోన్న Darago 3310 మోడల్ 1.77 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. స్ర్కీన్ రిసల్యూషన్ వచ్చేసరికి 320 x 240 పిక్సల్స్. 1ఎంబి ర్యామ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 8జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 0.3 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్ సపోర్ట్.

పూర్తి వివరాలు కోసం..

Darago 3310 ఫోన్ గురించి పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ఈ Flipkart listing పేజీలోకి వెళ్లండి.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Buy Darago 3310 - New Nokia 3310 Clone in India for Rs.799. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot