Home
Mobile

శామ్‌సంగ్ లవర్స్‌కు లక్కీ ఛాన్స్.. గెలాక్సీ S24పై ఏకంగా రూ.29,000 డిస్కౌంట్.. కొనాలా వద్దా?

దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ శామ్‌సంగ్ లవర్స్ కోసం అదిరిపోయే డీల్ తీసుకొచ్చింది. మార్కెట్లో టాప్ పెర్ఫార్మెన్స్‌కు కేరాఫ్‌గా నిలిచే శామ్‌సంగ్ గెలాక్సీ S24 ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఏకంగా రూ.29,000 తగ్గింపుతో, ఈ ఫోన్ ఇప్పుడు కేవలం రూ.50,999కే లభిస్తోంది. వాస్తవానికి ఈ ఫోన్ అసలు ధర రూ.79,999.

కొత్త మోడల్ గెలాక్సీ S25 త్వరలో విడుదల కానుండటంతో, ఇది పాత మోడల్‌ను తక్కువ ధరకే కొనుగోలు చేసేందుకు చక్కని అవకాశం. పెద్దగా ఖర్చు చేయకుండా ప్రీమియం స్మార్ట్‌ఫోన్ అనుభూతిని పొందాలనుకునే వారికి ఇది బెస్ట్ డీల్.

Buy Now Or Wait  Samsung Galaxy S24 Gets a Massive Rs 29000 Discount Ahead of S25 Launch

అంతేకాదు, అమెజాన్ అందిస్తున్న ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా ఓల్డ్ ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసి మరింత తక్కువ ధరకే ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు.

* గెలాక్సీ S24 ఎందుకు బెస్ట్ డీల్..

ఈ ఫోన్ ఇండియాలో లాంచ్ అయినప్పుడు దాని ధర రూ.79,999. దీంతో ఈ ఫోన్‌ ప్రైస్ చాలా ఓవర్‌గా పెట్టారని విమర్శలు వచ్చాయి. కానీ ఇప్పుడు అమెజాన్ అందిస్తున్న ఈ భారీ డిస్కౌంట్‌తో, అదే ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను మీరు రూ.50,999కే పొందవచ్చు.

* గెలాక్సీ S24 ఫీచర్లు

గెలాక్సీ S24లో 6.2-అంగుళాల LTPO AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. అంటే స్క్రోల్ చేస్తున్నా, గేమ్స్ ఆడుతున్నా, వీడియోలు చూస్తున్నా.. అన్నీ స్మూత్‌గా అనిపిస్తాయి. విజువల్స్ కళ్లకు కట్టినట్టు ఉంటాయి.

దీని పీక్ బ్రైట్‌నెస్ ఏకంగా 2,600 నిట్స్ కాబట్టి ఎంతటి ఎండలోనైనా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాదు, అవుట్‌డోర్స్‌లో మరింత స్పష్టత కోసం "ఎక్స్‌ట్రా బ్రైట్‌నెస్" మోడ్ కూడా ఉంది.

* పెర్ఫార్మెన్స్

ఈ ఫోన్‌లో శక్తివంతమైన ఎక్సీనోస్ 2400 ప్రాసెసర్ ఉంది. దీనికి 8GB RAM తోడవ్వడంతో, మల్టీ టాస్కింగ్ అయినా, పెద్ద పెద్ద యాప్స్ వాడినా, భారీ గ్రాఫిక్స్ గేమ్స్ ఆడినా.. ఫోన్ స్లో అవ్వదు. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ కంటే కొంచెం తక్కువ పవర్ కలిగి ఉండొచ్చు, కానీ ఎక్సీనోస్ 2400 కూడా AnTuTu, గీక్‌బెంచ్ 6 వంటి బెంచ్‌మార్క్స్‌లో అద్భుతమైన స్కోర్‌ను సాధించింది.

BGMI, Asphalt 9 వంటి గేమ్స్‌ను హైయ్యెస్ట్ సెట్టింగ్స్‌లో కూడా ఆడుకోవచ్చు. అయితే, ఎక్కువసేపు ఆడితే కొద్దిగా వేడెక్కడం వల్ల ఫ్రేమ్ రేట్స్ కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. కానీ డైలీ యూసేజ్‌లో ఏ చిన్న ప్రాబ్లమ్‌ కూడా తలెత్తదు.

సౌండ్ క్వాలిటీ కూడా సూపర్బ్‌గా ఉంటుంది. దీనిలోని హైబ్రిడ్ స్టీరియో స్పీకర్లు మంచి బేస్‌తో క్లియర్ సౌండ్ అందిస్తాయి. ఇందులో మ్యూజిక్ వింటుంటే మైమరచిపోతారు. కాల్ క్వాలిటీ కూడా చాలా స్పష్టంగా ఉంటుంది.

* కెమెరాలు

గెలాక్సీ S24లో వెర్సటైల్ కెమెరా సెటప్ ఉంది. వెనుకవైపు 50MP మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది చాలా డీటైల్డ్‌గా ఫొటోలను తీస్తుంది. జూమ్ చేయడానికి 10MP టెలిఫోటో లెన్స్, విశాలమైన దృశ్యాలను బంధించడానికి 12MP అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. అంటే, ఎలాంటి ఫొటోలు తీయాలనుకున్నా, ఈ ఫోన్ మీకు అన్ని విధాలా సహకరిస్తుంది.

* బ్యాటరీ

ఇందులో 4,000mAh బ్యాటరీ ఉంది. ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అలాగే, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.

* ఇప్పుడే ఎందుకు కొనాలి?

గెలాక్సీ S25 త్వరలో విడుదల కానుండటంతో, గెలాక్సీ S24 ఇప్పుడు చాలా తక్కువ ధరకే లభిస్తోంది. కొత్త మోడల్‌లో అప్‌గ్రేడెడ్ ఫీచర్లు ఉండొచ్చు, కానీ గెలాక్సీ S24 ఇప్పటికీ చాలా పవర్‌ఫుల్ ఫ్లాగ్‌షిప్ ఫోన్. ప్రీమియం పెర్ఫార్మెన్స్ కోరుకుంటూ, ఎక్కువ డబ్బు ఖర్చు చేయకూడదనుకుంటే, ఈ డీల్ మీకు బెస్ట్ అని చెప్పొచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy S24 gets a massive Rs 29,000 discount on Amazon ahead of the S25 launch. Buy now for Rs 50,999 and grab this limited-time offer on the premium smartphone.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X