Home
Mobile

వడ్డిలేకుండా వాయిదా పద్ధతిలో గెలాక్సీ ఎస్3...!

By Super
Buy samsung galaxy s3 With Interest Free EMI Option


గడిచిన గురువారం భారతీయ మార్కెట్లో విడుదలై సంచలనాల సృష్టిస్తున్న స్మార్ట్‌ఫోన్ సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3ని పలు ఆన్‌లైన్ రిటైల్ పోర్టళ్లు 4,000 తగ్గింపు ధరతో 38,900కు విక్రయిస్తున్నాయి. వీటిలో ఒకటైన ‘ఇండియా టైమ్స్ షాపింగ్’ వడ్డిలేకుండా వాయిదా పద్ధతి ద్వారా హ్యాండ్‌సెట్‌ను కొనుగోలు చేసే సౌలభ్యతను కల్పించింది. ఇంకా ఫ్రీ డెలివరీ సదుపాయాన్ని కల్పించారు.

వాయిదా స్కీములు:

3 నెలల ప్లాన్ - నెలకు చెల్లించాల్సిన మొత్తం రూ.12967.

6 నెలల ప్లాన్ - నెలకు చెల్లించాల్సిన మొత్తం రూ.6483.

‘గెలాక్సీ ఎస్ 3’ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు పై రాయితీని ప్రకస్తున్న ఆన్‌లైన్ షాపింగ్ సైట్ల వివరాలు…

హోమ్ షాప్18

ఈ ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ పోర్టల్ ‘గెలాక్సీ ఎస్ 3’ని రూ.38,900 ధరకు విక్రయిస్తోంది. ఎమ్మార్పీ ధరకు 4,000 తక్కువ. ఈ ఫోన్ కొనుగోలు పై కాంప్లీమెంటరీ బహుమతితో పాటు బ్లూటూత్ మోనో హెడ్‌సెట్‌ను ఉచితంగా పొందవచ్చు. దేశంలోని ఏ ప్రాంతానికైనా హోమ్ డెలివరీ చార్జీలు ఉండవు.

ఫ్లిప్‌కార్ట్:

ఈ ఆన్‌లైన్ రిటైలర్ ‘గెలాక్సీ ఎస్ 3’ని 30 రోజుల రీప్లేస్‌మెంట్ గ్యారంటీతో రూ.38900కు విక్రయిస్తోంది.

స్నాప్‌డీల్ :

దేశంలోని ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ స్టోర్‌లలో ఒకటైన స్నాప్‌డీల్ ‘గెలాక్సీ ఎస్ 3’ని రూ.38,900 ధరకు విక్రయిస్తోంది. కొనుగోలు పై ఉచిత బహుమతులు లేవు. ఉచిత హోమో డెలివరీ సదుపాయం కలదు. వస్తువు పొందిన తరువాతనే డబ్బు చెల్లించే సదుపాయాన్ని కల్పించారు.

ఈ-బే

ఈ ఆన్‌లైన్ రిటైలర్ నెలసరి వాయిదాల పద్ధతిలో గెలాక్సీ ఎస్3ని విక్రియస్తోంది. నిర్ణీత ధర రూ.38,900. వాయిదాల పద్ధతిలో చెల్లించే వారికి రుసుము ఎక్కువుగా ఉంటుంది.

బుయ్ ద ప్రైస్:

ఈ సైట్ రూ.38,900ధరకు గెలాక్సీ ఎస్3ని ఆఫర్ చేస్తుంది. వినియోగదారుల కొనుగోలు పై రూ.2,419 విలువ చేసే స్కల్ క్యాండీ లో రైడర్ ఎస్‌సీ హెడ్‌ఫోన్‌తో పాటు రూ. వెయ్యి విలువ చేసే బుయ్ ద ప్రైస్ వోచర్‌ను పొందవచ్చు.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X