మోటరోలా డ్రాయిడ్‌ పోటీని ఐఫోన్ 5 ఎదుర్కొంటుందా..?

Posted By: Super

మోటరోలా డ్రాయిడ్‌ పోటీని ఐఫోన్ 5 ఎదుర్కొంటుందా..?

రాబోయే కాలంలో ఆపిల్ కంపెనీ విడుదల చేయనున్న ఐఫోన్ 5 సమాచారాన్ని మార్కెట్లో విడుదల చేయనప్పటికీ మార్కెట్లో ఉన్న రూమర్స్ ప్రకారం ప్రపంచంలో ఎక్కడో ఒకచోట అక్టోబర్‌లో ఐఫోన్ 5 విడుదలవుతుందని అంటున్నారు మొబైల్ నిపుణులు. త్వరలో మొబైల్ మార్కెట్లోకి రానున్న ఆపిల్ కంపెనీ కొత్త ఐఫోన్ 5 ఈసారి గట్టి పోటీని ఎదుర్కోవడం తధ్యం అంటున్నారు.

శ్యామ్‌సంగ్ విడుదల చేయనున్న 'గెలాక్సీ ఎస్2' మొబైల్‌కి అమెరికాలో మంచి డిమాండ్ ఉండడం ఒక కారణం కాగా, మరో మొబైల్ తయారీదారు 'మోటరోలా డ్రాయిడ్ బయోనిక్‌'ని సెప్టెంబర్ 8వ తారీఖున మోటరోలా ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. మోటరోలా డ్రాయిడ్ బయోనిక్ మొబైల్ అండ్రాయిడ్ వి2.3.4 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను 4.3 ఇంచ్ స్క్రీన్‌ గోరిల్లా గ్లాస్‌ని కలిగి ఉంది. గోరిల్లా గ్లాస్ ఉండడంతో మొబైల్‌పై ఎటువంటి గీతలు పడినా మొబైల్‌కి ఎఫెక్టు ఉండదు.

మోటరోలా డ్రాయిడ్ బయోనిక్ మొబైల్ వెనుక భాగాన ఉన్న 8 మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో హై డెఫినేషన్ వీడియోలను తీయవచ్చు. కెమెరాకి డిజిటల్ జూమ్, ఫ్రీ లోడెడ్ అడోబ్ ప్లాష్ ప్లేయర్ ప్రత్యేకం. మొబైల్‌తో పాటు కొంత మొమొరీ లభిస్తుండగా ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మొమొరీని 32జిబి వరకు విస్తరించుకొవచ్చు.

ఇక ఐఫోన్ 5 ఫీచర్స్‌ని క్షుణ్ణంగా పరిశీలించినట్లైతే iOS 5 అపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. ఐఫోన్ 5 స్మార్ట్ ఫోన్ మొబైల్ వెనుక భాగాన 8 మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో చక్కని ఇమేజిలను తీయవచ్చు. గతంలో విడుదల చేసిన ఐఫోన్స్‌తో పోల్చితే ఐఫోన్ 5 చాలా తక్కువ మందం కలిగి ఉంటుందని వెల్లడించారు. ఐఫోన్ 5 మొబైల్‌తో 1080p వీడియో రికార్డింగ్‌ని నమోదు చేయవచ్చు. ఎల్‌ఈడి ఫ్లాష్, డిజిటల్ జూమ్ కెమెరా ప్రత్యేకతలు. మార్కెట్లో ఉన్ రూమర్ ప్రకారం ఐఫోన్ 5ని మోటరోలా డ్రాయిడ్ బయోనిక్ అన్నింటిలోను అధిగమిస్తుందని అంటున్నారు.

నెట్ వర్క్ విషయానికి వస్తే ఐఫోన్ 5, 4జీ టెక్నాలజీని సపోర్ట్ చేస్తుంది. అమెరికాలో ఏటి అండ్ టి నెట్ వర్క్స్‌కి 4జీ కరెక్టుగా సూట్ అవుతుండడంతో 4జీ ని సపోర్ట్ చేసే విధంగా దీనిని రూపోందించడం జరిగిందని అంటున్నారు. మోటరోలా డ్రాయిడ్ బయోనిక్ కూడా ఐఫోన్ 5కి సమానంగా ఫీచర్స్ ఉండడమే కాకుండా కొన్ని ఏరియాలలో ఎక్కువ ఫీచర్స్‌నే కలిగి ఉందని నిపుణులు అభిప్రాయం తెలియజేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ రెండు స్మార్ట్ ఫోన్స్ విడుదలైన తర్వాతనే వీటి గురించి మనం ఇంకా ఎక్కువ మాట్లాడుకొవచ్చు.

రెండు మొబైల్స్ కూడా హై ఎండ్ డివైజెస్ విభాగంలో విడుదలవుతుండడంతో రెండింటి ధర కూడా ఒకే విధంగా ఉండవచ్చునని మొబైల్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికి రెండింటి ధరను ఇంకా మార్కెట్లో ప్రవేశపెట్టలేదు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot