పోటీపడే దమ్ము వాళ్లకుందా..?

Posted By: Super

పోటీపడే దమ్ము వాళ్లకుందా..?

 

ప్రకటించిన కొద్ది రోజుల్లోనే 9 మిలియన్లను ప్రీబుకింగ్‌లను దక్కించుకుని ప్రపంచవ్యాప్తంగా హైప్ సృష్టిస్తున్న సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 అమ్మకాల విషయంలో కొత్త రికార్డుల వైపు దూసుకువెళుతోంది. ప్రస్తుతానికి వ్యాపారపరంగా ఈ ఫోన్ అందుబాటులో లేనప్పటికి ప్రత్యర్థి

బ్రాండ్‌లకు దడపుట్టిస్తుంది. ఈ మెగా గ్యాడ్జెట్‌కు  పోటీనిచ్చేందుకు ఎల్‌జీతో పాటు అనేక బ్రాండ్లు సన్నద్దమవుతునట్లు ప్రాధమికంగా తెలుస్తోంది.

ఎల్‌జీ ‘ఎక్లిప్స్’ మోడళ్లో  4జీ ఎల్‌టీఈ ఫోన్‌ను వృద్ధి చేసింది. అత్యాధునిక ఫీచర్లతో రూపుదిద్దుకున్న ఈ స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన 2100mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. సుదీర్ఠమైన స్టాండ్‌బైను ఈ బ్యాటరీ అందిస్తుంది. 1.5గిగాహెడ్జ్ ప్రాసెసింగ్ స్సీడ్‌తో కూడిన క్రెయిట్ ఎస్4 ప్రాసెసర్‌ను డివైజ్‌లో అమర్చటం మరింత లాభదాయకం.

4 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే ఉత్తమ క్వాలిటీ విజువల్ అనుభూతులను చేరువ చేస్తుంది. పోన్ వెనుక భాగంలో అమర్చిన 13 మెగాపిక్సల్ కెమెరా ఉత్తమ క్వాలిటీ ఫోటోగ్రఫీ లక్షణాలను ఒదిగి ఉంటుంది. గ్యాడ్జెట్ ఇంటర్నల్ మెమెరీ విషయానికొస్తే ఏర్పాట చేసిస 16జీబి రోమ్ అదేవిధంగా 2జీబి ర్యామ్ వ్యవస్థలు  వేగవంతమైన మల్టీటాస్కింగ్‌ను అందిస్తాయి.

గ్రాఫిక్ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తూ పొందుపరిచిన అడ్రినో 320 జీపీయూ వ్యవస్థ ఉత్తమమైన మల్టీ మీడియా అనుభూతులను చేరువ చేస్తుంది. ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం ఆధారితంగా ఎల్‌జీ ఎక్లిప్స్ పని చేస్తుంది. 4జీ ఎల్‌టీఈ వ్యవస్థ ఇంటర్నెట్ వేగాన్ని రెట్టింపు చేస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన వీడియో యట్యూబ్‌లో ప్రదర్శింపబుడుతుంది.  హ్యండ్‌సెట్‌లో అమర్చిన హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ స్పెసిఫికేషన్‌లు  ఉన్నత  స్థాయి మొబైలింగ్ అనుభూతులను చేరువ చేస్తాయి. శక్తివంతమైన అంశాలతో ఈ ఏడాది ద్వితియాంకంలో విడుదలకాబోతున్న ఎల్‌జీ ఎప్లిక్స్, గెలాక్సీ ఎస్3కి బలమైన ప్రత్యర్థిగా భావించవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot