Home
Mobile

అత్యంత తక్కువ ధరకే ఖరీదైన ఫోన్లు, మోజు తీరాక వాపస్ ఇచ్చేయవచ్చు !

ఇప్పుడు మార్కెట్ ని హైఎండ్ ఫోన్లు శాసిస్తున్నాయి. దిగ్గజ కంపెనీలు ఆపిల్, శాంసంగ్, గూగుల్, వంటి కంపెనీల ఫోన్లు వాడాలంటే మధ్య తరగతి వారికి తలకు మించిన భారమే.

By Hazarath Aiah

ఇప్పుడు మార్కెట్ ని హైఎండ్ ఫోన్లు శాసిస్తున్నాయి. దిగ్గజ కంపెనీలు ఆపిల్, శాంసంగ్, గూగుల్, వంటి కంపెనీల ఫోన్లు వాడాలంటే మధ్య తరగతి వారికి తలకు మించిన భారమే..అయితే దాన్ని వాడాలన్న ఆశ మాత్రం మదిలో బలంగా ఉంటుంది. అలాంటి వారికోసం కొత్తగా ఓ కంపెనీ పుట్టుకొచ్చింది. నెలవారి అద్దెకు హైఎండ్ కంపెనీల ఫోన్లు రెంట్ కు ఇచ్చే సదుపాయాన్ని తీసుకొస్తోంది. మీరు ముచ్చటపడుతున్న ఆ ఫోన్‌ను వాడుకునే అవకాశాన్ని ఆన్‌లైన్ రెంటల్ వెబ్‌సైట్ 'రెంటో మోజో కల్పిస్తోంది. అత్యాధునిక ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చిన కొత్త ఫోన్ ఎలా సొంతం చేసుకోవాలో చూద్దాం.

రెంటోమోజో వెబ్‌సైట్‌

రెంటోమోజో వెబ్‌సైట్‌

కన్జ్యూమర్‌ రెంటల్‌ వెబ్‌సైట్‌ రెంటోమోజో ఫర్నీచర్‌, ఎలక్ట్రానిక్స్‌, వెహికిల్స్‌తో పాటు స్మార్ట్‌ఫోన్లను అద్దెకు ఇవ్వడం ప్రారంభించింది.

ఆరు నెలలకు, ఏడాదికి, రెండేళ్లకు..

ఆరు నెలలకు, ఏడాదికి, రెండేళ్లకు..

ఈ ప్లాట్‌ఫామ్‌ ఫ్లాగ్‌షిప్‌ డివైజ్‌లు ఐఫోన్‌ ఎక్స్‌, ఐఫోన్‌ 8, గూగుల్‌ పిక్సెల్‌ 2, శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌9, శాంసంగ్‌ గెలాక్సీ నోట్‌ 8లను ఆరు నెలలకు, ఏడాదికి, రెండేళ్లకు అద్దెకు ఇవ్వడం ఆఫర్‌ చేస్తోది.

రూ.2,099 నుంచి ప్రారంభమై, రూ.9,299 వరకు..

రూ.2,099 నుంచి ప్రారంభమై, రూ.9,299 వరకు..

ఈ స్మార్ట్‌ఫోన్ల అద్దె నెలకు రూ.2,099 నుంచి ప్రారంభమై, రూ.9,299 వరకు ఉంది.

రెండేళ్ల అద్దె తర్వాత..

రెండేళ్ల అద్దె తర్వాత..

రెండేళ్ల అద్దె తర్వాత ఆ స్మార్ట్‌ఫోన్‌ యూజర్లు తమ సొంతం కూడా చేసుకునే ఆప్షన్‌ను రెంటోమోజో ఆఫర్‌ చేస్తోంది.

ఐఫోన్ ఎక్స్‌

ఐఫోన్ ఎక్స్‌

ఐఫోన్ ఎక్స్‌ను రెండేళ్లపాటు వాడాలనుకుంటే నెలకు రూ.4,299 చెల్లించాల్సి ఉంటుంది. ఆరు నెలలకే అయితే నెలకు రూ.9,299 చెల్లించాలి.

 రూ.9998 డిపాజిట్

రూ.9998 డిపాజిట్

అయితే, ఇందుకోసం ముందుగా రూ.9998 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఈ మొత్తాన్ని వెనక్కి ఇచ్చేస్తారు.

గూగుల్ పిక్సెల్ 2

గూగుల్ పిక్సెల్ 2

ఒకవేళ 24 నెలల తర్వాత ఈ ఐఫోన్‌ ఎక్స్‌ మీకు కావాలంటే అదనంగా రూ.15,556ను చెల్లించాలి. డిపాజిట్ తిరిగి ఇవ్వరు.

 

 

గూగుల్ పిక్సెల్ 2

గూగుల్ పిక్సెల్ 2

గూగుల్ పిక్సెల్ 2 ఫోన్‌ను రెండేళ్ల కాలానికి తీసుకుంటే నెలకు రూ.2,099, ఆరు నెలలకు అయితే రూ.5,398 చెల్లించాలి.

24 నెలల కాలానికి..

24 నెలల కాలానికి..

24 నెలల కాలానికి నెలవారీ 2,099 రూపాయలను చెల్లించాలి. ఆరు నెలలకు దీని అద్దె నెలవారీ 5,398 రూపాయలుగా ఉంది.

రూ.5,398 రీఫండబుల్‌ డిపాజిట్‌

రూ.5,398 రీఫండబుల్‌ డిపాజిట్‌

గూగుల్‌ పిక్సెల్‌ 2 స్మార్ట్‌ఫోన్‌కు కూడా రూ.5,398 రీఫండబుల్‌ డిపాజిట్‌ చెల్లించాలి.

వాడాలనే ఆశ కలిగిన వారికి

వాడాలనే ఆశ కలిగిన వారికి

కాగా రెంటోమోజో అద్దెకు ఉంచిన డివైజ్‌లన్నీ ఖరీదైనవే. కొంత కాలమైనా ఆ ఫోన్లను వాడాలనే ఆశ కలిగిన వారికి, రెంటోమోజో ఈ బంపర్‌ కానుకను అందిస్తుంది.

ప్రస్తుతం మెట్రో నగరాలకు మాత్రమే..

ప్రస్తుతం మెట్రో నగరాలకు మాత్రమే..

ప్రస్తుతం ఈ సేవలు మెట్రో నగరాలకు మాత్రమే పరిమితమని రెంటో మోజో పేర్కొంది. త్వరలోనే అన్ని నగరాలకు విస్తరిస్తామని తెలిపింది.

Best Mobiles in India

English summary
RentoMojo Now Offering Smartphones Like iPhone X, iPhone 8, Google Pixel 2, and Samsung Galaxy Note 8 on Rent more news at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X