దీపావళికి ధూమ్ ధామ్‌గా నోకియా మూడు మొబైల్స్...

Posted By: Staff

దీపావళికి ధూమ్ ధామ్‌గా నోకియా మూడు మొబైల్స్...

ప్రపంచంలో ఉన్న మొబైల్ తయారీదారుల్లో కెల్లా నోకియాది ప్రత్యేకమైన స్దానం. కేవలం నోకియా మొబైల్స్ రంగంలోకి వచ్చిన తర్వాతనే ప్రపంచం మొత్తానికి మొబైల్స్ విలువ తెలిసింది అనడంలో ఎటువంటి సందేహాం లేదు. నోకియా విడుదల చేసిన ప్రతి మొబైల్ కూడా మార్కెట్లో తనదైన ముద్రని వేస్తుంది. అది బేసిక్ మొబైల్ కానివ్వండి లేదా హై ఎండ్ మొబైల్ కానివ్వండి.

ఎదుగుతున్న ప్రపంచంలో రోజురోజుకీ పెరుగుతున్న పోటీని తట్టుకొని నిలబడాలంటే కొత్త ఉత్పత్తులను విడుదల చేయడమే కాకుండా, వాటికి సంబంధించిన అప్ గ్రేడ్ వర్సన్స్‌ని కూడా మార్కెట్లో విడుదల చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. అలాంటి వాటన్నింటిని అధిగమించింది కాబట్టే నోకియా ఈ రోజు ప్రపంచపు మొబైల్ రంగాన్ని ఏలుగలుగుతుంది.

ఇప్పుడు నోకియా హ్యాండ్ సెట్స్‌లోకి కొత్తగా ప్రవేశపెడుతున్న ఫీచర్ ఏమిటంటే 'కార్ ఎయిడ్ ఫీచర్స్'. దీనివల్ల ఉపయోగం ఏమిటంటే కారు డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వారికి నావిగేషన్ ద్వారా సిటీలో ఉన్న మార్గాలన్నింటిని కూడా చాలా ఈజీగా గుర్తించేలా రూపోందించడం జరిగింది. కొన్ని ఏరియాలలో ట్రాఫిక్ గనుక ఎక్కవగా ఉంటే దానికి సంబందించిన సమాచారాన్ని తెలియజేస్తూ వేర్ మార్గాన్ని సూచిస్తుంది. దీంతో డ్రైవర్స్ బోర్ కొట్టకుండా సాఫీగా సాగిపోతారు. ఈ ఫీచర్‌ని కేవలం నోకియా మోడల్స్ అయిన నోకియా 600, 700, 701, నోకియా ఎన్ 9 మొబైల్స్‌లలో మాత్రమే నిక్షిప్తం చేయడం జరిగింది.

ఈ కార్ మోడ్ అప్లికేషన్‌లో ఉన్న మరో ముఖ్యమైన ఫీచర్ ఏమిటంటే ఈ స్మార్ట్ ఫోన్స్ మిర్రర్ లింక్ ద్వారా కార్స్‌కు కనెక్ట్ చేయబడి ఉండడం జరుగుతుంది. ఇందులో భాగంగానే నోకియా ఫోన్స్‌ని సింబియన్ అప్ గ్రేడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌కి అప్ గ్రేడ్ చేయడం జరుగుతుంది. ఈ ఫీచర్‌ని దీపావళికి విడుదల చేయనున్న మూడు స్మార్ట్ పోన్స్‌లలో ఇమడికృతం చేయనున్నట్లు తెలిపారు.

నోకియా దీపావళికి విడుదల చేయనున్న ఈ మూడు మొబైల్స్‌లలో నోకియా 701 హై ఎండ్ విభాగంలో విడుదల చేయగా, దీని మొమొరీ కెపాసిటీ ఎక్కువగా ఉండడమే కాకుండా 8 మెగా ఫిక్సల్ కెమెరాని కలిగి ఉంది. ఇక దీని ఖరీదు విషయానికి వస్తే ఇండియన్ మార్కెట్లో సుమారుగా రూ 20,000 వరకు ఉండవచ్చునని అంచనా.

ఇక రెండవ మొబైల్ నోకియా 700 ఎన్‌ఎఫ్‌సి టెక్నాలజీతో విడుదలవుతుండడంతో దీని ధర కూడా సుమారుగా రూ 18,000 వరకు ఉండవచ్చునని మొబైల్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మూడవ మొబైల్ నోకియా 600. యూజర్స్‌కు ఈ దీపావళికి కనువిందు చేయడం కోసం వచ్చే ఈ మొబైల్ ధర సుమారుగా రూ 12,000 వరకు ఉంటుందని అంచనా..

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot