ఫోన్ అంటే ఇదే...

బెర్లిన్ వేదికగా జరుగుతోన్న IFA 2017 టెక్నాలజీ ట్రేడ్ షోలో భాగంగా క్యాటర్‌పిల్లర్ ఇంక్ (CAT), మూడు శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లతో పాటు ఒక టాబ్లెట్‌ను విడదల చేసింది. CAT S41, CAT S31 మోడల్స్‌లో స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉంటాయి. T20 పేరుతో టాబ్లెట్ అందుబాటులో ఉంటుంది.

Read More : నోకియా 3, నోకియా 5, నోకియా 6, నోకియా 8 ఫోన్‌లకు Android Oreo

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఎటువంటి వాతవరణంలోనైనా...

ఈ రగ్గుడ్ ప్రూఫ్ డివైస్‌స్ ఎటువంటి వాతవరణంలోనైనా సమర్థవంతంగా పనిచేస్తాయి. 2 మీటర్ల లోతైన నీటిలో గంటపాటు ఉండగలిగే ఈ ఫోన్‌లు 1.8 మీటర్ల ఎత్తు నుంచి క్రిందపడినప్పటికి ఎటువంటి ప్రమాదం వాటిల్లదు..

CAT S41 స్పెసిఫికేషన్స్..

5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్) విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా-కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 2TB వరకు విస్తరించుకునే అవకాశం, 5000mAh బ్యాటరీ, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ వోల్ట్ సపోర్ట్, పుష్ టు టాక్ షార్ట్ కట్ బటన్, లోన్ వర్కర్ యాప్ బటన్.

CAT S31 స్పెసిఫికేషన్స్..

4.7 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్720x 1280పిక్సల్స్) విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఐపీ68 రేటింగ్, ఆండ్రాయిడ్ నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్, 4000mAh బ్యాటరీ, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ వోల్ట్ సపోర్ట్, పుష్ టు టాక్ షార్ట్ కట్ బటన్, లోన్ వర్కర్ యాప్ బటన్.

CAT T20 టాబ్లెట్ స్పెసిఫికేషన్స్..

8 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 800x 1280పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్-కోర్ ఇంటెల్ ఆటమ్ జెడ్8530 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్, మినీ-హెచ్‌డిఎమ్ఐ, వీడియో అవుట్ పోర్ట్, 7500mAh బ్యాటరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
CAT launches three new devices at IFA 2017, S41, S31 smartphones and T20 Tablet. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot