రూ.2599కే సెల్‌కాన్ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఫోన్
ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ సెల్‌కాన్ మరో చవక ధర ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. సెల్‌కాన్ ‘ఏ354సీ' మోడల్‌లో అందుబాటులోకి వచ్చిన ఈ హ్యాండ్‌సెట్ ధర రూ.2599. రెడ్, బ్లాక్, వైట్ ఇంకా బ్లూ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంచారు. సెల్‌కాన్ ‘ఏ354సీ' స్మార్ట్‌ఫోన్‌ను ప్రముఖ రిటైలర్ HomeShop18 ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది. ధర రూ.2,999.

సెల్‌కాన్ ‘ఏ354సీ' స్పెసిఫికేషన్‌లు:
3.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 320పిక్సల్స్), 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 256 ఎంబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 0.3 మెగా పిక్సల్ వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (2జీ, వై-ఫై, బ్లూటూత్, ఏ2డీపీ), డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 512 ఎంబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 1200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








