రెహమానిష్క్ సిరీస్ నుంచి సెల్‌కాన్ ఏఆర్40 విడుదల
హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీసంస్థ సెల్‌కాన్, అహ్మదాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో తన రెహమానిష్క్ సిరీస్ నుంచి సెల్‌కాన్ ఏ40 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ధర రూ.5,999. ప్రముఖ రిటైల్ అవుట్‌లెట్‌లలో ఈ ఫోన్ అక్టోబర్ నెలాఖరు నుంచి లభ్యమవుతుంది.

సెల్‌కాన్ ఏఆర్40 కీలక స్పెసిఫికేషన్‌లు:
4 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
3.2 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీ, వై-ఫై 802.11 బి/జి/ఎన్,
బ్లూటూత్ 4.0 ఇంకా జీపీఎస్ కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
సెల్‌కాన్ ఏఆర్40 స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకమైన షేక్ టూ ట్రాన్స్‌ఫర్ ఫీచర్‌ను కలిగి ఉంది. ఈ పత్ర్యేక ఫీచర్ ద్వారా ఫోన్‌ను షేక్ చేస్తూ డేటాను వేరొక హ్యాండ్‌సెట్‌కు ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. రెహమాన్ చార్ట్ బస్టర్లను ఫోన్‌లో ముందస్తుగా లోడ్ చేయటం జరిగింది.


Click it and Unblock the Notifications








