సెల్‌కాన్ రెహమానిష్క్ ఆండ్రాయిడ్ ఫాబ్లెట్ ‘ఏఆర్50’ విడుదల!

|

హైదరాబాద్ ముఖ్యకేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ప్రముఖ దేశవాళీ మొబైల్ ఫోన్‌ల తయారీ బ్రాండ్ సెల్‌కాన్ తన రెహమానిష్క్ సిరీస్ నుంచి ‘సెల్‌కాన్ ఏఆర్50' పేరుతో లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ ఫాబ్లెట్‌ను మార్కెట్లో విడుదల చేసింది. సంగీత ప్రియులను అమితంగా ఆకట్టుకునే ఈ మ్యూజికల్ హ్యాండ్‌సెట్ ధర రూ.8,499.

 

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

 

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

సెల్‌కాన్ రెహమానిష్క్ ఆండ్రాయిడ్ ఫాబ్లెట్  ‘ఏఆర్50’ విడుదల!

సెల్‌కాన్ ఏఆర్50' ప్రధాన స్పెసిఫికేషన్‌లు...

5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 512ఎంబి ర్యామ్, 5 మెగా పిక్సల్ ఆటోఫోకస్ రేర్ కెమెరా, ఫ్రంట్ ఫేసింగ్ షూటర్, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫాబ్లెట్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత. కనెక్టువిటీ ఫీచర్లు: డ్యూయల్ సిమ్ సపోర్ట్, డ్యూయల్ స్టాండ్‌బై, 3జీ కనెక్టువిటీ, వై-ఫై 802.11 బి/జి/ఎన్, బ్లూటూత్ 4.0, జీపీఎస్.

సెల్‌కాన్ ఏఆర్50 స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకమైన షేక్ టూ ట్రాన్స్‌ఫర్ ఫీచర్‌ను కలిగి ఉంది. ఈ పత్ర్యేక ఫీచర్ ద్వారా ఫోన్‌ను షేక్ చేస్తూ డేటాను వేరొక హ్యాండ్‌సెట్‌కు ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. రెహమాన్ చార్ట్ బస్టర్లను ఫోన్‌లో ముందస్తుగా లోడ్ చేయటం జరిగింది.

సెల్‌కాన్ రెహమానిష్క్ నుంచి ఇటీవల విడుదలైన ఏఆర్45 స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్ లు:

4.5 అంగుళాల డిస్‌ప్లే, 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్, డ్యూయల్ సిమ్, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, సంగీతాన్సి స్పష్టంగా వినిపించే కే క్లాస్ ఆంప్లిపైయర్. కనెక్టువిటీ ఫీచర్లు: 3జీ, వై-ఫై 802.11 బి/జి/ఎన్, బ్లూటూత్ 4.0, జీపీఎస్. సెల్‌కాన్ ఏఆర్45 స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకమైన షేక్ టూ ట్రాన్స్‌ఫర్ ఫీచర్‌ను కలిగి ఉంది. ఈ పత్ర్యేక ఫీచర్ ద్వారా ఫోన్‌ను షేక్ చేస్తూ డేటాను వేరొక హ్యాండ్‌సెట్‌కు ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. రెహమాన్ చార్ట్ బస్టర్లను ఫోన్‌లో ముందస్తుగా లోడ్ చేయటం జరిగింది. సెల్‌కాన్ ఏఆర్45 ధర ఇంకా అందుబాటు: రిటైల్ మార్కెట్లో సెల్‌కాన్ ఏఆర్45 స్మార్ట్‌ఫోన్ ధర రూ.7,999.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X