సెల్‌కాన్ క్యాంపస్ ఏ125@రూ.6,299

Posted By:

ఖ దేశవాళీ మొబైల్ ఫోన్‌ల తయారీ కంపెనీ సెల్‌కాన్ మొబైల్స్ ‘క్యాంపస్ ఏ125' పేరుతో సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. బ్లాక్ ఇంకా వైట్ కలర్ వేరియంట్స్‌లో లభ్యమయ్యే ఈ ఫోన్ ధర రూ.6,299. 3జీ కనెక్టువిటీ, పెద్దదైన తాకే తెర, డ్యుయల్ సిమ్ వాయిస్ కాలింగ్, శక్తివంతమైన బ్యాటరీ బ్యాకప్ వంటి అంశాలు ఈ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. సెల్‌కాన్ ‘క్యాంపస్ ఏ125' కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.....

సెల్‌కాన్ క్యాంపస్ ఏ125@రూ.6,299

ఫోన్ పరిమాణం 138 x 68.5 x 10 మిల్లీ మీటర్లు,
బరువు 78.2 గ్రాములు,
డ్యుయల్ సిమ్,
5.4 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 960 x 854పిక్సల్స్),
1.3గిగాహెట్జ్ క్లాక్ వేగంతో కూడిన డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
కనెక్టువిటీ ఫీచర్లు (జీపీఆర్ఎస్, 3జీ, వై-ఫై, ఎడ్జ్, డబ్ల్యూఎల్ఏఎన్, బ్లూటూత్, యూఎస్బీ).

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot