రూ.2,999కే సెల్‌కాన్ క్యాంపస్ ఏ35కె ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఫోన్

బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ ప్రముఖ దేశవాళీ మొబైల్ ఫోన్‌ల తయారీ కంపెనీ సెల్‌కాన్ మొబైల్స్ అందరికి అమోదయోగ్యమైన ధరలో సెల్‌కాన్ క్యాంపస్ ఏ35కె (Celkon Campus A35K) పేరుతో సరికొత్త ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోవిడుదల చేసింది. ఈ చవక ధర ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఫోన్ ధర రూ.2,499.

3.5 అంగుళాల తాకేతెర, 3జీ వీడియో కాలింగ్, వేగవంతమైన 1గిగాహెట్జ్ ప్రాసెసర్, డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, 3.2 మెగా పిక్సల్ కెమెరా, 512 ఎంబి ఇంటర్నల్ మెమెరీ, వై-ఫై, బ్లూటూత్,1400ఎమ్ఏహెచ్ బ్యాటరీ వంటి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫీచర్లను ఈ ఫోన్ లో నిక్షిప్తం చేసారు.
సెల్‌కాన్ క్యాంపస్ ఏ35కె స్మార్ట్‌ఫోన్‌ను స్టైలిష్ ఇంకా పొదుపైనదిగా సెల్‌కాన్ అభివర్ణించింది. రానున్న 30 రోజుల్లో క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ వంటి విశిష్టమైన ఫీచర్లతో కూడిన 25 కొత్త వేరియంట్ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు సెల్‌కాన్ మొబైల్స్ ఈ ఆవిష్కరణ సందర్భంగా వెల్లడించింది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications