తెలుగు సహా ఏడు ప్రాంతీయ భాషల సపోర్ట్‌తో సెల్‌కాన్ సీ76

Posted By:

హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ప్రముఖ దేశవాళీ మొబైల్ ఫోన్‌ల తయారీ సంస్థ సెల్‌కాన్ తెలుగుతో సహా 7 ప్రాంతీయ భాషలను సపోర్ట్ చేసే సౌలభ్యతతో కూడిన సరికొత్త డ్యూయల్ సిమ్ ఫీచర్ ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ‘సీ76' మోడల్‌లో లభ్యమవుతున్న ఈ ఎంట్రీస్థాయి ఫీచర్ ఫోన్ ధర రూ.1,899. చాక్లెట్ ఇంక్ సిల్వర్, బ్లాక్ ఇంకా సిల్వర్ వేరియంట్‌లలో ఈ ఫోన్ లభ్యంకానుంది.

తెలుగు సహా ఏడు ప్రాంతీయ భాషల సపోర్ట్‌తో సెల్‌కాన్ సీ76

ఈ ప్రాధమిక స్థాయి ఫోన్‌కు సంబంధించి స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:

2.8 అంగుళాల డిస్‌ప్లే,
డ్యూయల్ సిమ్ స్లాట్,
వైర్‌లెస్ ఎఫ్ఎమ్ రేడియో ఫీచర్,
1.3 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 16జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
కనెక్టువిటీ ఫీచర్లు: బ్లూటూత్, జీపీఆర్ఎస్, WAP,
1400ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఈ ఫోన్ ఆవిష్కరణ సందర్భంగా సంస్థ చైర్మన్ ఇంకా మేనేజింగ్ డైరక్టర్ వై.గురు మాట్లాడుతూ ఏడు ప్రాంతీయ భాషలను సపోర్ట్ చేసే సౌలభ్యతతో తయారుచేయబడిన సెల్‌కాన్ సీ76 ప్రజల ప్రాంతీయ అవసరాల దృష్ట్యా ఆయా భాషల్లో సంక్షిప్త సందేశాలతో పాటు ఇతర కమ్యూనికేషన్ కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు దోహదపడుతుందని అన్నారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot