సెల్‌కాన్ నుంచి తెలుగు మొబైల్ ఫోన్‌లు

Posted By:

సెల్‌కాన్ నుంచి తెలుగు మొబైల్ ఫోన్‌లు

ప్రముఖ దేశవాళీ మొబైల్ ఫోన్‌ల తయారీ కంపెనీ సెల్‌కాన్ మొబైల్స్ తెలుగులో వినియోగించుకునే విధంగా సెల్‌ఫోన్‌లను అభివృద్ధి చేసింది. మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా సెల్‌కాన్ మొబైల్స్ తెలుగు భాషను సపోర్ట్ చేసే 5 స్మార్ట్‌ఫోన్ మోడల్స్‌తో పాటు 10 ఫీచర్ ఫోన్‌లను ఆవిష్కరించింది.

ఇప్పటికే మార్కెట్లో ఉన్న తమ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు కొత్తగా ఆవిష్కరించే 90శాతం స్మార్ట్‌ఫోన్‌లలో తెలుగు భాషను సపోర్ట్ చేసే ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‍‌ను నిక్షిప్తం చేస్తామని సంస్థ తెలిపింది. కార్యక్రమంలో పాల్గోన్న రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి పోన్నాల లక్ష్మయ్య తెలుగు సాఫ్ట్‌వేర్‌ను ఇన్స్‌స్టాల్ చేసిన సెల్‌కాన్ ఏ15 (ధర రూ.3,600), సెల్‌కాన్ ఏ40 (రూ.5,600) స్మార్ట్‌ఫోన్‌లను లాంఛనంగా విడుదల చేసారు.

తమ హ్యాండ్ సెట్‌లలో నిక్షిప్తం చేసిన అత్యాధునిక తెలుగు సాఫ్ట్‌వేర్ వ్యవస్థ ద్వారా ఫోన్ కాంటాక్టులు మొదలుకుని ఎస్ఎంఎస్‌లు పంపుకోవడం, ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్స్‌యాప్ వంటి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో నిర్వహించుకునే ఛాటింగ్ వరకు తెలుగులోనే సాధ్యపడుతుందని కంపెనీ ఈ సందర్భంగా వివరించింది. ప్రస్తుత స్మార్ట్‌ఫోన్‌లలో ఆంగ్ల అక్షరాలు టైప్ చేస్నున్నప్పుడు స్పెల్లింగ్‌కు అనుగుణంగా సూచిక పదాలు కొన్ని వస్తాయని, అదే తరహాలో తమ ఫోన్‌లలో తెలుగు పదాలు రావడంతో పాటు పద నిఘంటువు కూడా డిస్‌ప్లే పై ప్రత్యక్షమవుతుందని కంపెనీ వెల్లడించింది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

‘‘యూసీ బ్రౌజర్‌ను ఎందుకు ఇష్టపడుతున్నారో చెప్పండి. ఆపై, గెలుచుకోండి నెక్సూస్5 32జీబి వర్షన్‌ను ఉచితంగా''

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot