త్రిముఖ పోరులో ఆ ఇద్దరితో ‘ఢీ’!

Posted By: Super

త్రిముఖ పోరులో ఆ ఇద్దరితో ‘ఢీ’!

 

చవక ధర కలిగిన స్మార్ట్‌ఫోన్‌లను వినియోగదారులకు పరిచయం చేసే క్రమంలో దేశీయ మొబైల్ బ్రాండ్‌లైన సెల్కాన్, మైక్రోమ్యాక్స్, స్పైస్‌ల మధ్య త్రిముఖ పోరు నెలకుంది. ఈ పోటీలో ముందంజలో దూసుకుపోతున్న సెల్‌కాన్ తాజాగా రెండు ఆండ్రాయిడ్ ఆధారిత

స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించింది. తక్కువ ధర స్మార్ట్‌ఫోన్‌ల విభాగానికి చెందిన ఈ ఫోన్‌లు సెల్‌కాన్ ఏ95 (ధర రూ.5,299), సెల్‌కాన్ ఏ97 (ధర రూ.8,499) మోడళ్లలో లభ్యం కానున్నాయి. ఇటీవల కాలంలో మైక్రోమ్యాక్స్ ఇంకా స్పైస్ బ్రాండ్లు ప్రవేశపెట్టిన స్మార్ట్‌ఫోన్‌లకు ఈ గ్యాడ్జెట్‌లు ప్రధాన పోటీగా నిలువనున్నాయి.

సెల్‌కాన్ ప్రవేశపెట్టిన స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధంచి స్పెసిఫికేషన్‌లను పరిశీలిస్తే... ప్రధానంగా ఈ రెండు స్మార్ట్ మొబైలింగ్ డివైజ్‌లు ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతాయి. 1గిగాహెడ్జ్ సామర్ధ్యం గల ప్రాసెసర్లను నిక్షిప్తం చేశారిు. మెమరీని 32జీబి వరకు ఎక్స్‌ప్యాండ్ చేసుకోవచ్చు. బ్లూటూత్ వ్యవస్థ డేటాను వేగవంతంగా షేర్ చేస్తుంది. వై-ఫై ఇంకా 3జీ కనెక్టువిటీ వ్యవస్థను ఇంటర్నెట్ బ్రౌజింగ్‌ను మరింత వేగవంతం చేస్తాయి.

రూ.8,499 ధర కలిగిన సెల్‌కాన్ ఏ97, స్పెస్ స్టెల్లార్ స్మార్ట్‌ఫోన్‌కు ప్రధాన పోటీదారుగా నిలవనుంది. స్నాప్‌డ్రాగెన్ ప్రాసెసర్ ను స్టెల్లార్‌లో పొందుపరిచారు. ధర రూ.9,999. మరో ఫోన్ సెల్‌కాన్ ఏ95, మైక్రోమ్యాక్స్ ఏ52కు ప్రధాన కాంపీటీటర్. మార్కెట్ల్ ఏ52 ధర రూ.5,699.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot