తమన్నా రాకతో కెవ్వు కేక!

Posted By: Prashanth

తమన్నా రాకతో కెవ్వు కేక!

 

మిల్క్ బ్యూటీ తమన్నాప్రచారకర్తగా వ్యవహరిస్తోన్న మొబైల్ ఫోన్‌ల తయారీ బ్రాండ్ సెల్‌కాన్ దేశ వ్యాప్తంగా ప్రాచుర్యాన్ని పొందుతోంది. ఆధునిక పరిజ్ఞానంతో కూడిన మొబైల్‌ఫోన్‌లను సమంజసమైన ధరలకు పరిచయం చేస్తున్నఈ సంస్థ అనతికాలంలోనే సామన్యుని నేస్తంగా గుర్తింపు తెచ్చుకుంది.

తాజాగా ఈ బ్రాండ్ 1 గిగాహెట్జ్ ప్రాసెసర్‌తో కూడిన ఆండ్రాయిడ్ ఫోన్లను దేశీయ మార్కెట్లో ఆవిష్కరించింది. శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఏ-95, ఏ-97 మోడళ్లలో డ్యూయల్‌సిమ్ ఫోన్‌లను బ్రాండ్ అంబాసిడర్ తమన్నా చేతుల మీదగా సెల్‌కాన్ యాజమాన్యం విడుదల చేసింది. ప్రముఖ చిప్‌సెట్ తయారీ సంస్థ మీడియాటెక్ కొత్తగా ప్రవేశపెట్టిన 6575 చిప్‌ను ప్రపంచంలో తొలిసారిగా ఈ మోడళ్లలో పొందుపరిచినట్టు కంపెనీ వెల్లడించింది. రూ.5,299 ధర కలిగిన ఏ-95 ఫోన్ లో, హై ఎండ్ హ్యాండ్‌సెట్‌లలో లభ్యమయ్యే సౌలభ్యతలన్ని ఉంటాయని సంస్థ ఎండీ వై.గురు తెలిపారు.

సెల్‌కాన్ ఏ95 ప్రధాన ఫీచర్లు:

3.2 అంగుళాల టచ్ స్ర్కీన్ డిస్‌ప్లే,

ఆండ్రాయిడ్ 2.3.6 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

1గిగాహెట్జ్ ప్రాసెసర్,

3జీ కనెక్టువిటీ,

3మెగా పిక్సల్ కెమెరా,

వై-ఫై,

32జీబి ఎక్స్‌పాండబుల్ మెమెరీ,

మన్నికైన బ్యాకప్ నిచ్చే 1400ఎంఏహెచ్ బ్యాటరీ.

ధర రూ.5,299.

సెల్‌కాన్ ఏ97 ప్రధాన ఫీచర్లు:

4 అంగుళాల టచ్ స్ర్కీన్ డిస్‌ప్లే,

5మెగా పిక్సల్ కెమెరా,

1గిగాహెడ్జ్ ప్రాసెసర్,

మన్నికైన బ్యాకప్ నిచ్చే 1500ఎంఏహెచ్ బ్యాటరీ,

ధర రూ.8,499.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot