సెల్‌కాన్ మిలీనియం స్మార్ట్‌ఫోన్‌లు

Posted By:

హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోన్న ప్రముఖ దేశవాళీ మొబైల్ ఫోన్‌ల తయారీ కంపెనీ సెల్‌కాన్ తన మిలీనియమ్ సిరీస్ నుంచి రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. ‘పవర్ క్యూ3000', ‘ఎలైట్ క్యూ470' మోడల్స్‌లో రూపుదిద్దుకున్న ఈ ఫోన్‌లను మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కె.టి. రామారావు ఆవిష్కరించారు.

సెల్‌కాన్ మిలీనియం స్మార్ట్‌ఫోన్‌లు

మిలీనియమ్ క్యూ3000 స్మార్ట్‌ఫోన్‌ను ప్రముఖ రిటైలర్ స్నాప్‌డీల్ (Snapdeal) తన లిస్టింగ్స్‌లో ఉంచింది. ఈ ఫోన్ ధరను రూ.8,999గా సదరు రిటైలర్ పేర్కొంది. ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...

సెల్‌కాన్ మిలీనియం స్మార్ట్‌ఫోన్‌లు

5 అంగుళాల FWVGA డిస్‌ప్లే (రిసల్యూషన్ 480x854పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ (ఎంటీ6582ఎమ్) ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

సెల్‌కాన్ మిలీనియం స్మార్ట్‌ఫోన్‌లు

సెల్‌కాన్ ఎలైట్ క్యూ470 స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... డ్యూయల్ సిమ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 4.7 అంగుళాల హైడెఫినిషన్ స్ర్కీన్ (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్), 1.3గిగాహెట్జ్ మీడియాటెక్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత. ఫోన్ ధర రూ.11,999

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot