మార్కెట్లోకి కొత్త ఫోన్.. సెల్‌కాన్ మిలీనియమ్ గ్లోరీ క్యూ5

Posted By:

హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోన్న ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ సెల్‌కాన్ మొబైల్స్, ‘మిలీనియమ్ గ్లోరీ క్యూ5' పేరుతో సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.7,299. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ snapdeal.com రేపటి నుంచి ఈ స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించనుంది. ఆండ్రాయిడ్  కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ ప్రాససెర్, 1జీబి ర్యామ్, 3జీ కనెక్టువిటీ వంటి ప్రత్యేకతలను ఈ ఫోన్ కలిగి ఉంది.  గేమింగ్‌కు అనువుగా గేమ్‌లాఫ్ట్ పేరుతో ప్రత్యేక ఫీచర్‌ను ఫోన్‌లో నిక్షిప్తం చేసారు. సెల్‌కాన్ మిలీనియమ్ గ్లోరీ క్యూ5 ప్రత్యేకతలు...

 మార్కెట్లోకి కొత్త ఫోన్.. సెల్‌కాన్ మిలీనియమ్ గ్లోరీ క్యూ5

డ్యూయల్ సిమ్ వాయిస్ కాలింగ్ (3జీ+3జీ),
5 అంగుళాల ఐపీఎస్ ఓజీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ ఇంకా సెల్ఫీలను చిత్రీకరించుకునేందుకు),
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, బ్లూటూత్, వైఫై, జీపీఎస్, ఎజీపీఎస్, జీపీఆర్ఎస్, ఎడ్జ్ కనెక్టువిటీ),
1800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

బబుల్ బ్యాష్ 3, ద అవెంజర్స్ - ద మొబైల్ గేమ్, ప్రిన్స్ ఆఫ్ పెర్షియా, మోడరన్ కాంబాట్ 4: జీరో అవర్ వంటి గేమ్‌లను  ఫోన్‌లో ముందుగా ఇన్స్‌స్టాల్ చేసారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Celkon Millennium Glory Q5 Launched At Rs 7,299 In Association With Gameloft. Read more in Telugu Gizbot........
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot