విపణిలోకి సెల్‌కాన్ మిలీనియమ్ అల్ట్రా క్యూ500

హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోన్న ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ సెల్‌కాన్ ‘మిలీనియమ్ అల్ట్రా క్యూ500' పేరుతో సరికొత్త ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.9,999. వైట్ కలర్ ఆప్షన్‌లో లభ్యమవుతున్న ఈ స్మార్ట్ మొబైలింగ్ హ్యాండ్‌సెట్‌ను ప్రముఖ రిటైలర్ Snapdeal ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది.
సెల్‌కాన్ మిలీనియమ్ అల్ట్రా క్యూ500 ప్రత్యేకతలు:
5 అంగుళాల ఐపీఎస్ ఓజీఎస్ డిస్‌ప్లే (హైడెఫినిషన్ రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ బ్రాడ్ కామ్ బీసీఎమ్23550 ప్రాసెసర్, వీడియోకోర్ ఐవీ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ), 2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications