‘తమన్నా బ్రాండ్’ ఇప్పుడు యూనివర్సెల్ అవుట్‌లెట్‌లలో

Posted By: Super

 ‘తమన్నా బ్రాండ్’ ఇప్పుడు యూనివర్సెల్ అవుట్‌లెట్‌లలో

హైదరాబాద్: మిల్క్ బ్యూటీ తమన్నా ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న సెల్‌కాన్ మొబైల్స్‌ను బుధవారం నుంచి యూనివర్సెల్ అవుట్‌లెట్‌లలో అందుబాటులోకి తెచ్చారు. మల్టీబ్రాండ్ సెల్‌ఫోన్స్‌ను విక్రియించే యూనివర్సెల్‌కు ఆంధ్రప్రదేశ్ సహా ఇతర రాష్టాల్లో దాదాపు 500 అవుట్‌లెట్‌లు ఉన్నాయి. వీటిలోని 350 అవుట్‌లెట్‌లలో తమ బ్రాండ్ ఫోన్‌లను అమ్మకానికి ఉంచామని సెల్‌కాన్ ఎండీ వై.గురు తెలిపారు. దేశవ్యాప్తంగా 800ల అవుట్‌లెట్ కలిగి ఉన్న స్పైస్ హాట్‌స్పాట్‌లో వారం తర్వాత నుంచి సెల్‌కాన్ ఫోన్లు అందుబాటులోకి వస్తాయని ఆయన వివరించారు.

గడిచిన డిసెంబరులో రాష్ట్రంలో 2.5 లక్షల సెల్‌ఫోన్లను విక్రయించామని, మే నెలలో ఈ సంఖ్య 3.27 లక్షలకు చేరుకుందని చెప్పారు. రూ.2 వేల లోపు ధరలో మంచి ఫీచర్లతో 20కి పైగా మోడళ్లను ఆఫర్ చేస్తున్నామని అన్నారు. సెల్‌ఫోన్లు విక్రయించే 12,000 ఔట్‌లెట్లలో సెల్‌కాన్ మోడళ్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. కస్టమర్లకు మరింత చేరువ అయ్యేందుకు వీటి సంఖ్యను గణనీయంగా పెంచుతున్నట్టు చెప్పారు. కాగా, దేశవ్యాప్తంగా సెల్‌ఫోన్ల అమ్మకాలు మందగించినా, రాష్ట్రంలో మాత్రం వృద్ధి నమోదవుతోందని చెప్పారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot