సెల్‌కాన్ మొబైల్స్ నుంచి ‘ఎవోక్ ఎ43’ స్మార్ట్‌ఫోన్

Posted By:

సెల్‌కాన్ మొబైల్స్ తన క్యాంపస్ శ్రేణి నుంచి ‘ఎవోక్ ఎ43' పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను గురువారం విడుదల చేసింది. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి తమిళ హీరో సూర్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కేవలం 93 గ్రాముల బరువుతో రూపకల్పన కాబడిన ఈ సొగసరి
స్మార్ట్ మొబైలింగ్ డివైస్ ధర రూ.5,699. అన్ని ప్రధాన రిటైల్ ఇంకా ఆన్‌లైన్ స్టోర్‌ల వద్ద సెల్‌కాన్ ఎవోక్ ఎ43 ఫోన్ లభ్యమవుతోంది. ఆండ్రాయిడ్
కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అయ్యే ఈ మొబైలింగ్ డివైస్ కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...

 సెల్‌కాన్ మొబైల్స్ నుంచి ‘ఎవోక్ ఎ43’ స్మార్ట్‌ఫోన్

4 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
శక్తివంతమైన 1.3 డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఫ్లాష్ సౌకర్యంతో),
1.3 మెగా పిక్సల్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
3జీ కనెక్టువిటీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot