మార్కెట్లోకి రెహమానిష్క్ మ్యూజిక్ స్మార్ట్‌ఫోన్‌

Posted By:

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ సెల్‌కాన్ మొబైల్స్ తన రెహమాన్‌ఇష్క్ సిరీస్ నుంచి ‘ఏఆర్45' పేరుతో మొదటి స్మార్ట్‌ఫోన్‌ను కోల్‌కతాలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో 4డీ హాలోగ్రాఫిక్ పద్ధతిలో ఆవిష్కరించింది. ఈ కార్యక్రమంలో స్వర మాంత్రికుడు ఏఆర్ రెహమాన్, సెల్‌కాన్ మొబైల్ చైర్మన్ ఇంకా మేనేజింగ్ డైరెక్టర్ వై. గురు, కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్. మురళి పాల్గొన్నారు.

మార్కెట్లోకి రెహమానిష్క్ మ్యూజిక్ స్మార్ట్‌ఫోన్‌

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్‌‌లను పరిశీలించినట్లయితే:

4.5 అంగుళాల డిస్‌ప్లే, 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్, డ్యూయల్ సిమ్, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, సంగీతాన్సి స్పష్టంగా వినిపించే కే క్లాస్ ఆంప్లిపైయర్. కనెక్టువిటీ ఫీచర్లు: 3జీ, వై-ఫై 802.11 బి/జి/ఎన్, బ్లూటూత్ 4.0, జీపీఎస్.

సెల్‌కాన్ ఏఆర్45 స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకమైన షేక్ టూ ట్రాన్స్‌ఫర్ ఫీచర్‌ను కలిగి ఉంది. ఈ పత్ర్యేక ఫీచర్ ద్వారా ఫోన్‌ను షేక్ చేస్తూ డేటాను వేరొక హ్యాండ్‌సెట్‌కు ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. రెహమాన్ చార్ట్ బస్టర్లను ఫోన్‌లో ముందస్తుగా లోడ్ చేయటం జరిగింది.

సెల్‌కాన్ ఏఆర్45 ధర ఇంకా అందుబాటు:

రిటైల్ మార్కెట్లో సెల్‌కాన్ ఏఆర్45 స్మార్ట్‌ఫోన్ ధర రూ.7,999. అక్టోబర్ నుంచి వీటి విక్రయాలు ప్రారంభమవుతాయి. త్వరలో సెల్‌కాన్, రెహమాన్ ఇష్క్ సిరీస్ నుంచి మరిన్ని ఫోన్‌లను విడుదల చేయనుంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot