1జీబి ర్యామ్‌తో సెల్‌కాన్ ఎస్1@రూ.14999

|

రాష్ట్రానికి చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్‌ల తయారీ కంపెనీ సెల్‌కాన్ వేగవంతమైన ఇంటర్నెట్ ప్రాసెసింగ్ ఇంకా పెద్ద‌తెర స్మార్ట్‌ఫోన్‌లను ఇష్టపడేవారి కోసం సెల్‌కాన్ ఎస్1 పేరుతో సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.14,999. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ హ్యాండ్‌సెట్ 13 మెగాపిక్సల్ ఆటోఫోకస్ కెమెరాను కలిగి ఉంది. అలానే వీడియో చాటింగ్ నిర్వహించుకునేందుకు ఫోన్ ముందు భాగంలో 8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరాను ఏర్పాటు చేసారు. సెల్‌కాన్ ఎస్1 కీలక స్పెసిఫికేషన్‌లు:

1జీబి ర్యామ్‌తో సెల్‌కాన్ ఎస్1@రూ.14999

ఫోన్ బరువు 137 గ్రాములు,
5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే, ఓజీఎస్ టెక్నాలజీతో,
1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
ఆడ్రాయిడ్ 4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా (డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్ సామర్ద్యంతో),
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీ హెచ్ఎస్ పీఏ+ కనెక్టువిటీ, వై-ఫై802.11 బీజీఎన్, బ్లూటూత్, ఏజీపీఎస్,
3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియ్,
లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, గైరోస్కోప్ సెన్సార్,
1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ,
2300ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఈ పోన్ బ్లాక్ కలర్ వేరియంట్‌లో మాత్రమే లభ్యమవుతోంది. ధర రూ.14,999.

సెల్‌కాన్ ఎస్1కు మార్కెట్లో కార్బన్ టైటానియమ్ ఎస్7కు పోటీ ఎదురుకానుంది. టైటానియమ్ ఎస్7 స్సెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.. 5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే, 1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, వై-ఫై కనెక్టువిటీ, ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), ఫోన్ ధర రూ.14,999.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X