సెల్‌కాన్ సిగ్నేచర్ టూ ఎ500@రూ.5,999
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోన్న ప్రముఖ దేశవాళీ మొబైల్ ఫోన్‌ల తయారీ కంపెనీ సెల్‌కాన్ ‘సిగ్నేచర్ టూ ఎ500' పేరుతో సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఫోన్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. 5 అంగుళాల పెద్దదైన తెరతో రూపకల్పన కాబడిన ఈ ఫోన్ ధర రూ.5,999. 8జీబి ఇంటర్నల్ మెమెరీ, 1జీబి ర్యామ్, 1.3గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ కెమెరా, 3జీ, వై-ఫై, బ్లూటూత్ వంటి ప్రత్యేకతలను ఈ ఫోన్ కలిగి ఉంది. ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ సెల్‌కాన్ సిగ్నేచర్ టూ ఎ500 స్మార్ట్‌ఫోన్‌లను ఎక్స్ క్లూజివ్ గా విక్రయిస్తోంది.

సెల్‌కాన్ సిగ్నేచర్ టూ ఎ500 కీలక స్పెసిఫికేషన్‌లు:
5 అంగుళాల FWVGA డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1.3గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, జీ సెన్సార్),
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








