సెల్‌కాన్ నుంచి అతిపెద్ద ఫోన్

Posted By:

హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోన్న ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ సెల్‌కాన్ ‘జియోన్ ఎస్ సీటీ6595' పేరుతో సరికొత్త ఫాబ్లెట్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. 6.95 అంగుళాల డిస్‌ప్లేతో యాపిల్ ఐఫోన్ 6 ప్లస్ కంటే పెద్దగా కనిపించే ఈ ఫోన్ ధర రూ.7,499. సెల్‌కాన్ ఇప్పటి వరకు విడుదల చేసిన అన్ని ఫోన్‌ల కంటే ఈ లేటెస్ట్ ఫాబ్లెట్ పెద్దది.

సెల్‌కాన్ నుంచి అతిపెద్ద ఫోన్

సెల్‌కాన్ జియోన్ ఎస్‌సీటీ6595 కీలక స్పెసిఫికేషన్‌లు:

6.95 అంగుళాల స్ర్కీన్ (సినిమాలు ఇంకా ఈ-పుస్తకాలను చదువుకునేందుకు ఈ పెద్దదైన డిస్‌ప్లే మరింత అనువుగా ఉంటుంది),
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, 2జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్),
డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Celkon XION S CT6595: 6.95-Inch Phablet Launched in India At Rs 7,499. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot