కళ్లు చెదిరే ఆఫర్లతో దేశీయ దిగ్గజం సవాల్ !

Written By:

మొబైల్ మార్కెట్లో దూసుకుపోతున్న దేశీయ దిగ్గజం సెల్‌కాన్‌ దేశంలో తొలిసారిగా వినూత్నమైన ఆఫర్‌ను ప్రకటించింది. ఎంపిక చేసిన ఫీచర్‌ ఫోన్లపై జీవితకాల వారంటీ ఆఫర్‌ను ఆవిష్కరించింది. ఆఫర్‌లో భాగంగా యూజర్లు వారి ఫోన్లను ఎన్ని సంవత్సరాల పాటైనా (జీవితాంతం) ఉచితంగా రిపేర్‌ చేయించుకోవచ్చు. దేశీయ దిగ్గజం ప్రకటించిన ఆఫర్లపై ఓ స్మార్ట్ లుక్కేద్దామా..

ఇకపై డబ్బులు చెల్లిస్తేనే వాట్సప్, ఫ్రీ కాదు !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జీవితకాలం వారంటీ ఆఫర్

ఎంపిక చేసిన ఫోన్లకు ఇకపై జీవితకాలం వారంటీ ఆఫర్ ను సెల్‌కాన్‌ ప్రకటించింది. ఈ ఆఫర్‌ బాగా అమ్ముడవుతున్న కొన్ని పాపులర్‌ హ్యాండ్‌సెట్లకే వర్తిస్తుందని, ఆ తర్వాత ఇతర ఫోన్లకు కూడా విస్తరిస్తామని కంపెనీ తెలిపింది.

పలు ఇతర ఆఫర్లను

లైఫ్‌టైమ్‌ వారంటీ ఆఫర్‌ను ఆవిష్కరించిన సందర్భంగా కంపెనీ ఎండీ గురు పలు ఇతర ఆఫర్లను కూడా ఆవిష్కరించారు. ఈ సంధర్భంగా మాట్లాడుతూ అన్ని ఫోన్లను దేశీయంగానే తయారు చేస్తూ, నాణ్యతపై పూర్తిగా పట్టు సాధించాం. కంపెనీ ఎదుగుదలకు తోడుగా నిలిచిన వారికోసమే ఈ జీవితకాల వారంటీ ఆఫర్‌ను ఆవిష్కరించామని తెలిపారు.

సిల్వర్‌ ఎడిషన్‌

రానున్న పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని కంపెనీ పలు ఆఫర్లను ప్రకటించింది. అందులో సిల్వర్‌ ఎడిషన్‌ ఒకటి. ఇక్కడ సెల్‌కాన్‌ హ్యాండ్‌సెట్‌ కొన్న వారు వెండి నాణేన్ని ఉచితంగా పొందొచ్చు. అయితే ఈ ఆఫర్‌ కొన్ని ఫోన్లకే వర్తిస్తుంది.  దీంతో పాటు రూ.899 పెట్టి ఫోన్‌ కొనుగోలు చేసినవారు రెండో ఫోన్‌పై 50 శాతం డిస్కౌంట్‌ కూడా పొందొచ్చు.

మరో పది రోజుల్లో కొత్త స్మార్ట్‌ఫోన్‌

వచ్చే 10 రోజుల్లో రూ.2,999కే స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తెస్తున్నట్లు గురు ప్రకటించారు. ఇందులో 4 అంగుళాల డిస్‌ప్లే, అధిక బ్యాటరీ సామర్థ్యం, మూన్‌లైన్‌ సెల్పీ కెమెరా, 4జీ వంటి పలు ప్రత్యేకతలుంటాయని చెప్పారు.

3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్‌ మెమరీ వంటి ఫీచర్‌లతో

వచ్చేనెలలో డ్యూయెల్‌ రియర్‌ కెమెరా, 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్‌ మెమరీ వంటి ఫీచర్‌లతో స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లో ఆవిష్కరించనున్నట్లు కూడా వెల్లడించారు. వీటి ధర రూ.10,000లోపు ఉంటుందని ఆయన తెలియజేశారు.

రూ.1,000లోపు ఫీచర్‌ ఫోన్లను

టెల్కోలతో కలిసి పలు ఆఫర్లతో రూ.1,000లోపు ఫీచర్‌ ఫోన్లను తీసుకువస్తామన్నారు. ఇప్పటికే పలు టెలికం ఆపరేటర్లతో చర్చలు జరుగుతున్నాయని వివరించారు.

ప్రతి జిల్లా కేంద్రంలోనూ సొంత సర్వీస్‌ సెంటర్‌

లైఫ్‌టైమ్‌ వారంటీ ఆఫర్‌ నేపథ్యంలో కంపెనీ ప్రతి జిల్లా కేంద్రంలోనూ సొంత సర్వీస్‌ సెంటర్‌ను ప్రారంభించనుంది. ప్రస్తుతం సంస్థకు 1,400 వరకూ సర్వీస్‌ సెంటర్లున్నాయి.

నెలకు 10 లక్షల ఫోన్ల విక్రయాలను

డిసెంబర్‌ చివరి నాటికి నెలకు 10 లక్షల ఫోన్ల విక్రయాలను లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు గురు తెలియజేశారు. 

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Celkon Mobiles has introduced a 'lifetime warranty' for some of its feature phones Read more News At Gizbot Telugu'
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot