మొబైల్ మనుషులు..తెగిపోతున్న బంధాలు

Posted By:

మితిమీరిన మొబైల్ వినియోగం మానవ బంధాలను సైతం తుంచేస్తోంది. ఉదాహరణకు: ఇద్దరు మిత్రుల మధ్య మనస్పర్థలు తలెత్తటానికి ఓ సెల్‌ఫోన్ కారణమయ్యిందంటే నేటి జీవితాల్లోకి సెల్‌ఫోన్ ఏ మేరకు చొచ్చుకుపోయిందో అర్ధం చేసుకోవచ్చు.

మొబైల్ ఫోన్‌ల వినియోగం వ్యక్తిగత సంబంధాలను దారుణంగా దెబ్బతీస్తున్నాయని ఎసెక్స్ విశ్వవిద్యాలయ మానసిక నిపుణులు బృందం ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడించింది. మొబైల్స్ వాడినా... వాడక పోయినా .. కేవలం అవి పక్కనే ఉంటే చాలు జరగాల్సిన నష్టం జరిగిపోతుందని ఈ అధ్యయనకర్తలు హెచ్చరిస్తున్నారు.

ఇద్దరు వక్తులు చక్కగా ఓ చోట కూర్చొని ముఖాముఖిగా మాట్లాడుకుంటున్న సమయంలో అక్కడే ఉన్న మొబైల్ ఫోన్‌ల మూలంగా ఆ సంభాషణ పూర్తి యాంత్రికంగా మారుతోందని పరిశోధనలో పాలుపంచుకున్న నిపుణులు వెల్లడించారు. సామాజిక సంబంధాలను సైతం మొబైల్ ఫోన్ లు తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని ఈ బృందం అభిప్రాయపడింది. మొబైల్ వినియోగం మితిమీరటంతో ముఖాముఖి సంభాషణలు మొక్కుబడిగా తయారవుతున్నాయని ఈ అధ్యయనం అంతిమంగా తేల్చేసింది.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Cell phones can damage personal relationships

మొబైల్ మనుషులు..తెగిపోతున్న బంధాలు


Cell phones can damage personal relationships

మొబైల్ మనుషులు..తెగిపోతున్న బంధాలు

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting