DTH సౌండ్‌తో CENTRiC A1 స్మార్ట్‌ఫోన్
దేశీయ దిగ్గజ మొబైల్ సంస్థ CENTRiC DTH సౌండ్‌తో CENTRiC A1 ఫోన్‌ను లాంచ్ చేసింది.
దేశీయ దిగ్గజ మొబైల్ సంస్థ CENTRiC DTH సౌండ్‌తో CENTRiC A1 ఫోన్‌ను లాంచ్ చేసింది. octa-core Snapdragon 430 chip సెట్‌తో వచ్చిన ఈ ఫోన్ ధరను కంపెనీ రూ. 10,999గా నిర్ణయించింది. పూర్తిగా మెటల్ బాడీతో తయారైన ఈ ఫోన్లో వెనుక భాగంలో ఉన్న ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో కేవలం 0.2 సెకండ్లలోనే ఫోన్‌ను అన్‌లాక్ చేయవచ్చు.

కాగా డీటీఎస్ సౌండ్ క్వాలిటీనిచ్చే ఆడియో చిప్‌సెట్ దీనికి ప్రధాన ఆకర్షణ. దీని ద్వారా నాణ్యమైన ఆడియోను యూజర్లు ఆస్వాదించవచ్చు. దీంతో పాటు ఈ ఫోన్‌లో ఏర్పాటు చేసిన బ్యాటరీ.. క్విక్ చార్జ్ 3.0 సపోర్ట్‌ను కలిగి ఉండడం వల్ల కేవలం 30 నిమిషాల్లోనే 50 శాతం వరకు చార్జింగ్ పూర్తవుతుంది. క్లాసిక్ వైట్ గోల్డ్, ఎనర్జిటిక్ బ్లాక్ గ్రే, వైబ్రంట్ గోల్డ్ రంగుల్లో ఈ ఫోన్ యూజర్లకి అందుబాటులో ఉంది.

Image soruce : bgr
సెంట్రిక్ ఎ1 ఫీచర్లు
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, డ్రాగన్ ట్రెయిల్ గ్లాస్ ప్రొటెక్షన్, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.1 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డీటీఎస్ ఆడియో సపోర్ట్, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0.


Click it and Unblock the Notifications








