పవర్‌పుల్ బ్యాటరీతో CENTRiC L3, రూ.6749కే

Written By:

దేశీయ మొబైల్ దిగ్గజం సంస్థ సెంట్రిక్ బడ్జెట్ ధరలో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. 4జీ ఫీచర్లతో పాటు అత్యంత తక్కువ ధరలో ఈ ఫోన్ లాంచ్ చేసినట్లు కంపెనీ తెలిపింది. రూ.6,749 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తోంది. కాగా ఇందులో బ్యాటరీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ 4జీ ఫోన్‌లో 3050 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న పవర్‌ఫుల్ బ్యాటరీని ఏర్పాటు చేశారు. అలాగే ముందు భాగంలో డిస్‌ప్లే కింద ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు. మీడియాటెక్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ తో పాటు ఫోన్‌లో మైక్రో ఎస్‌డీకార్డ్, సిమ్ కార్డుల కోసం 3 వేర్వేరు స్లాట్లను ఏర్పాటు చేశారు. క్వాడ్జ్ గ్రే, రైసిన్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తున్నది. 2జిబి ర్యామ్ 16 జిబి ఇంటర్నల్ మెమెరీతో ఈ ఫోన్ మార్కెట్లోకి దూసుకొచ్చింది. ఫోన్ పూర్తి ఫీచర్లు ఓ సారి పరిశీలిస్తే..

పవర్‌పుల్ బ్యాటరీతో CENTRiC L3, రూ.6749కే

ట్రెండ్ సెట్ చేసిన షియోమి రెడ్‌మి 5A, న్యూ రికార్డ్ సేల్స్ !

సెంట్రిక్ ఎల్3 ఫీచర్లు

5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 3050 ఎంఏహెచ్ బ్యాటరీ.

English summary
CENTRiC 'L3' smartphone in India for Rs. 6,749
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot