Just In
- 9 hrs ago
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- 10 hrs ago
తక్కువ ధరలో, ఎక్కువ ఫీచర్లతో, బెస్ట్ స్మార్ట్ టీవీలు ! లిస్ట్ ,ధరలు చూడండి!
- 14 hrs ago
మీ కంప్యూటర్ లలో ఈ బ్రౌజర్ వాడుతున్నారా? జాగ్రత్త ...గవర్నమెంట్ వార్నింగ్ ఇచ్చింది!
- 16 hrs ago
OnePlus నుంచి కొత్త టాబ్లెట్, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్ల వివరాలు!
Don't Miss
- News
ఏ క్షణమైనా ఢిల్లీ నుంచి వైఎస్ జగన్ కు పిలుపు: విశాఖ పర్యటన రద్దు?
- Sports
ఆ తప్పిదమే మా ఓటమిని శాసించింది: హార్దిక్ పాండ్యా
- Movies
సమంతలా అరియానా గ్లోరి అరాచకం.. 'శాకుంతలం' గెటప్పులో మత్తెక్కించే పరువాలతో అంతా చూపిస్తూ!
- Finance
adani lic: భారీ నష్టాల్లో LIC.. కారణమేంటో తెలుసా..?
- Lifestyle
మీ పార్ట్నర్తో బంధంలోని స్పార్క్‌ని మేల్కొలపండి, ఇలా బెడ్రూములో హీట్ పెంచండి
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
రేపటి నుంచే సీఈఎస్ 2014
టెక్నాలజీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అతిపెద్ద టక్నాలజీ ఎగ్జిబిషన్ ‘కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో 2014' (సీఈఎస్ 2014) రేపటి నుంచి లాస్ వేగాస్‌లో ప్రారంభంకానుంది. జనవరి 7వతేది నుంచి 10వ తేది వరకు నాలుగు రోజులు పాటు సాగే ఈ ఎలక్ట్రానిక్స్ షోలో అనేక సరికొత్త ఆవిష్కరణలు చోటు చేసుకోనున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లు మొదలుకుని సరికొత్త టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లు, గేమింగ్ టెక్నాలజీ, హైడెఫినిషన్ టీవీలు, స్మార్ట్‌వాచ్‌లు, రిఫ్రీజరేటర్లు ఇంకా ఇతర ఎలక్ట్రానిక్ గృహోపకరణాలను సీఈఎస్2014 వేదికగా వివిధ కంపెనీలు ప్రదర్శించనున్నాయి.

హైడెఫినిషన్ టీవీలు
సీఈఎస్ 2014ను పురస్కరించుకుని ప్రముఖ కొరియన్ కంపెనీ ఎల్‌జి 105 అంగుళాల అతిపెద్ద ఎల్ఈడి టీవీని ప్రదర్శించనుంది. ఈ భారీ ఆవిష్కరణతో పాటు 5 సరికొత్త 4కే ఓఎల్ఈడి యూనిట్‌లను ఎల్‌జి ప్రదర్శించనుంది.
సీఈఎస్ 2014లో కొత్త స్మార్ట్‌ఫోన్‌లు!
సీఈఎస్ 2014లో భాగంగా సామ్‌సంగ్ ఇంకా ఎల్‌జి కంపెనీలు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించనున్నాయి. సామ్‌సంగ్ తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ అయిన గెలాక్సీ ఎస్5ను ఈ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించే అవకాశం ఉంది. మరో వైపు ఎల్‌జి ‘జీ2 మినీ' పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను సీఈఎస్ 2014లో ఆవిష్కరించే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 1080 పిక్సల్ డిస్‌ప్లే, 2జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ కెమెరా, స్నాప్‌డ్రాగన్ 800 ప్రాసెసర్ వంటి శక్తివంతమైన ఫీచర్లను ఎల్‌జి జీ2 మినీ కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు, సోనీ యూఎస్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను సీఈఎస్ 2014లో ఆవిష్కరించే అవకాశాలు ఉన్నాయి. ఎల్టీఈ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేసే విధంగా లెనోవో రూపొందించిన మొట్టమొదటి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ‘వైబ్ జెడ్'ను లెనోవో సీఈఎస్ 2014లో ఆవిష్కరించనుంది. మరో మూడు ఆండ్రాయిడ్ హ్యాండ్‌సెట్‌లను లెనోవో సీఈఎస్ వేదిక పై ఆవిష్కరించనుంది.
సీఈఎస్ 2014లో కొత్త టాబ్లెట్‌లు:
వొంపు తిరిగిన డిస్‌ప్లేలతో రూపుదిద్దుకంటున్న స్మార్ట్‌ఫోన్‌ల తరహాలోనే కర్వుడ్ డిస్‌ప్లే వ్యవస్థతో కూడిన టాబ్లెట్ పీసీలను సీఈఎస్ 2014లో ఆవిష్కరించే అవకాశముందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
సీఈఎస్ 2014లో స్మార్ట్‌వాచ్‌లు!
సోనీ, సామ్‌సంగ్, క్వాల్కమ్ వంటి ప్రముఖ కంపెనీలు ఇప్పటికే స్మార్ట్‌వాచ్‌లను మార్కెట్లో విడుదల చేసాయి. మార్కెట్లో వీటికి మిశ్రమ స్పందన లభిస్త్తోంది. యాపిల్, గూగుల్, నోకియా వంటి కంపెనీలు ఇంకా తమ మొదటి స్మార్ట్‌వాచ్‌లను రూపొందించే పనిలోనే ఉన్నాయి. సీఈఎస్ 2014లో భాగంగా ఎప్సన్, ఆర్చోస్ వంటి కంపెనీలు ధరించదగిన సాంకేతికను ఆవిష్కరించనున్నాయి.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470