సీఈఎస్ 2015: విడుదల కాబోతున్న 10 హైక్లాస్ స్మార్ట్‌ఫోన్‌లు

Posted By:

అతిపెద్ద టెక్నాలజీ ఈవెంట్ ‘సీఈఎస్ 2015' మరికొద్ది గంటల్లో ప్రారంభంకాబోతోంది. లాస్ వేగాస్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జనవరి 6 నుంచి 9వరకు సరికొత్త టెక్నాలజీ ఆవిష్కరణలతో ఈ ప్రదర్శన కనువిందు చేయనుంది. సరికొత్త స్మార్ట్ వేరబుల్ టెక్నాలజీ ఈ ఎగ్జిబిషన్‌కు ప్రధాన ఆకర్షణ కానుందని టెక్నాలజీ పండితులు విశ్లేషిస్తున్నారు.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

ఈ బృహత్తర సాంకేతిక ప్రదర్శనను పురస్కరించుకుని ప్రముఖ కంపెనీలు భారీ ఆవిష్కరణలతో ముస్తాబయ్యాయి. సామ్‌సంగ్, సోనీ, లెనోవో, అసుస్, ఏసర్, షియోమీ వంటి కంపెనీలు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి. మరోవైపు కోడాక్, వయో కంటి కంపెనీలు తమ మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌లను సీఈఎస్ 2015 వేదికగా ప్రదర్శించేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి.

సీఈఎస్ 2015 వేదికగా విడుదల కాబోతున్న 10 హైక్లాస్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సీఈఎస్ 2015: విడుదల కాబోతున్న 10 హైక్లాస్ స్మార్ట్‌ఫోన్‌లు

Sony Xperia Z4

సీఈఎస్ 2015 వేదికగా సోనీ తన ఫ్లాగ్‌షిప్ మోడల్ ఫోన్ ఎక్స్‌పీరియా జెడ్4ను ఆవిష్కరించనుంది.

ఫోన్ ఫీచర్లు (అనధికారికంగా)

5.2 అంగుళాల క్యూహైడెఫినిషన్ స్ర్కీన్,
స్నాప్ డ్రాగన్ 810 ప్రాసెసర్,
3జీబి ర్యామ్,
20.7 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఎల్టీఈ కనెక్టువిటీ,
ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం.

సీఈఎస్ 2015: విడుదల కాబోతున్న 10 హైక్లాస్ స్మార్ట్‌ఫోన్‌లు

LG G Flex 2

సీఈఎస్ 2015 వేదికగా ఎల్‌జీ తన ఫ్లాగ్‌షిప్ మోడల్ ఫోన్ జీ ఫ్లెక్స్ 2ను ఆవిష్కరించబోతోంది.

సీఈఎస్ 2015: విడుదల కాబోతున్న 10 హైక్లాస్ స్మార్ట్‌ఫోన్‌లు

హెచ్‌టీసీ డిజైర్ ఫోన్

సీఈఎస్ 2015 హెచ్‌టీసీ విడుదల చేయబోయే డిజైర్ ఫోన్‌కు సంబంధించి అన్ని వివరాలను గోప్యంగా ఉంచారు.

సీఈఎస్ 2015: విడుదల కాబోతున్న 10 హైక్లాస్ స్మార్ట్‌ఫోన్‌లు

సీఈఎస్ 2015 షియోమీ తమ లేటెస్ట్ ఎమ్ఐ‌ 5 ఫోన్‌ను ప్రదర్శించే అవకాశముంది.

సీఈఎస్ 2015: విడుదల కాబోతున్న 10 హైక్లాస్ స్మార్ట్‌ఫోన్‌లు

సీఈఎస్ 2015 వేదికగా అసుస్ తన జెన్‌ఫోన్ సిరీస్ పలు చౌక ధర 4జీ ఫోన్‌లను ఆవిష్కరించనుంది.

సీఈఎస్ 2015: విడుదల కాబోతున్న 10 హైక్లాస్ స్మార్ట్‌ఫోన్‌లు

సీఈఎస్ 2015 వేదికగా ప్రముఖ కెమెరాల తయారీ కంపెనీ కొడాక్ తన మొట్టమొదటి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది.

సీఈఎస్ 2015: విడుదల కాబోతున్న 10 హైక్లాస్ స్మార్ట్‌ఫోన్‌లు

ఐరిస్ రిసల్యూషన్ టెక్నాలజీతో కూడిన ఓ స్మార్ట్‌ఫోన్‌ను వ్యూసోనిక్ అనే కంపెనీ సీఈఎస్ 2015 వేదికంగా పరిచయం చేయబోతోంది.

సీఈఎస్ 2015: విడుదల కాబోతున్న 10 హైక్లాస్ స్మార్ట్‌ఫోన్‌లు

2015, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (సీఈఎస్) వేదికగా చౌక ధర 4జీ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించనున్నట్లు లెనోవో పేర్కొంది. ఇండియన్ మార్కెట్లో ఈ ఫోన్ ధర రూ.5,000 లోపు ఉండొచ్చని తెలుస్తోంది. స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్‌తో రన్ అయ్యే ఫోన్ జనవరి 15లోపే భారత్‌లో విడుదలవుతుందని పలు మీడియా రిపోర్ట్స్ అంచనావేస్తున్నాయి.

సీఈఎస్ 2015: విడుదల కాబోతున్న 10 హైక్లాస్ స్మార్ట్‌ఫోన్‌లు

సీఈఎస్ 2015 వేదికగా జపాన్‌కు చెందిన వయో బ్రాండ్ నుంచి ఓ ఫోన్ రాబోతున్నట్లు తెలుస్తోంది.

సీఈఎస్ 2015: విడుదల కాబోతున్న 10 హైక్లాస్ స్మార్ట్‌ఫోన్‌లు

సీఈఎస్ 2015 వేదికగా ఏసర్ పలు చౌక ధర 4జీ ఎల్టీఈ స్మార్ట్‌ఫోన్‌లను ప్రదర్శించనుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
CES 2015: 10 Smartphones to Launch in Las Vegas this Week. Read more in Telugu Gizbot.....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot