వెయ్యి రూపాయల్లో కేక పుట్టించే ఫోన్!

Posted By: Super

వెయ్యి రూపాయల్లో కేక పుట్టించే ఫోన్!

 

మొబైల్ ఫోన్‌ల తయారీ విభాగంలోకి నూతనంగా ప్రవేశించిన చాజ్ సంస్థ తాజాగా ‘చాజ్ చోటూ’ పేరుతో డ్యూయల్ సిమ్‌ఫోన్‌ను ప్రవేశపెట్టింది. యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లతో తక్కువ బరువు కలిగి ఉన్న ఈ హ్యాండ్‌సెట్ ధర రూ.1099. ఏర్పాటు చేసిన రబ్బరు కీప్యాడ్ వ్యవస్థ

ఫోన్ జీవితకాలాన్ని రెట్టింపు చేస్తుంది. డ్యూయల్ సిమ్ సౌలభ్యతతో ఏకకాలంలో రెండు నెట్‌వర్క్‌లను ఉపయోగించుకోవచ్చు.

మెమెరీని ఎక్స్‌ప్యాండబుల్ స్లాట్ ద్వారా 4జీబికి పెంచుకోవచ్చు. ఫోన్‌బుక్‌లో 500 ఎంట్రీలను స్టోర్ చేసుకోవచ్చు. ముందుగా లోడ్ చేసిన గేమ్స్, గేమింజ్ మజాను రుచిచూపిస్తాయి. 4.6సెంటీమీటర్ల టీఎఫ్టీ డిస్‌ప్లే మన్నికైన రిసల్యూషన్ వ్యవస్థను కలిగి క్లారిటీతో కూడిన విజువల్స్‌ను విడుదల చేస్తుంది. అమర్చిన 1050 mAh బ్యాటరీ మన్నికైన బ్యాకప్‌ను అందిస్తుంది.

ఫేస్‌బుక్, ట్విట్టర్, యాహూ, గుగూల్ వంటి సోషల్ నెట్‌వర్కింగ్ సర్వీస్‌లను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఫోన్ వెనుక భాగంలో అమర్చిన 1.3మెగా పిక్సల్ కెమెరా క్వాలిటీతో కూడిన ఫోటోగ్రఫీని విడుదల చేస్తుంది. మల్టీ ఫార్మాట్ మ్యూజిక్ ప్లేయర్ నాణ్యమైన సంగీతాన్ని శ్రావ్యమైన కోణంలో అందిస్తుంది.

ఏర్పాటు చేసిన మొబైల్ ట్రాకర్ వ్యవస్థ ఫోన్ అదృశ్యమైన సందర్భంలో వెతికిపట్టుకునేందుకు ఉపయోగపడుతుంది. నిక్షిప్తం చేసిన స్పెషల్ ఫీచర్లు ఫోన్‌లోని డేటాను భద్రపరుస్తాయి. ఇంగ్లీష్, హిందీ భాషలను డివైజ్ సపోర్ట్ చేస్తుంది. బ్లాక్ విత్ బ్లూ, రెడ్ విత్ బ్లాక్ కలర్

వేరియంట్‌లలో ఈ ఫోన్ లభ్యమవుతుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot