మంగళమ్ గ్రూప్స్ నుంచి సరికొత్త మొబైల్!!!

Posted By: Prashanth

మంగళమ్ గ్రూప్స్ నుంచి సరికొత్త మొబైల్!!!

 

ఎమర్జింగ్ బ్రాండ్‌లలో ఒకటైన ‘ఛాజ్’(Chaze) భారతీయ మొబైల్ ఫోన్ మార్కెట్‌లో తరచుగా వినబడే పేరు. కె.ఆర్. మంగళమ్ గ్రూప్స్ ఈ మొబైల్స్‌ను ఉత్పత్తి చేస్తుంది. తాజాగా ఈ బ్రాండ్ నుంచి ‘C333’ మోడల్‌లో ఓ ఫోన్ విడుదలైంది. సరికొత్త ఫీచర్లతో పాటు స్పెసిఫికేషన్‌లను ఈ డివైజ్‌లో లోడ్ చేశారు.

ఈ మొబైల్ స్ర్కీన్ పరిమాణం 3.2 అంగుళాలు, టచ్ స్ర్కీన్ టెక్నాలజీ కలిగి ఉంటుంది. లౌడ్ స్పీకర్‌తో పాటు డ్యూయల్ ఛార్జింగ్ పాయింట్‌ను పరికరంలో ఏర్పాటు చేశారు. అమర్చిన 3.2 మెగా పిక్సల్ కెమెరా ఉత్తమమైన రిసల్యూషన్ సామర్ధ్యాన్ని కలిగి నాణ్యమైన చిత్రాలను అందిస్తుంది.

పొందుపరిచిన 1500 mAh బ్యాటరీ 25 రోజుల స్టాండ్ బైనిస్తుంది. ఆడియో ప్లేయర్ అదేవిధంగా వీడియో ప్లేయర్ వ్యవస్థను గ్యాడ్జెట్‌లో నిక్షిప్తం చేశారు. ఇన్‌బుల్ట్ చేసిన ఎఫ్ఎమ్ రేడియో, ఎంపీత్రీ ప్లేయర్ వ్యవస్థలు వినోదపు అవసరాలను పూర్తి స్థాయిలో తీరుస్తాయి.

ఫేస్‌బుక్, ట్విట్టర్, యాహూ మెసెంజర్ వంటి సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్ అప్లికేషన్‌లను ఫోన్‌లో ముందుగానే లోడ్ చేశారు. సెక్యూరిటీకి సంబంధించి మొబైల్ ట్రాకింగ్, బ్లాక్ లిస్ట్ ఫీచర్లను దోహదం చేశారు. తేదీ సమాయాన్ని బట్టి శుభ, రాహు కాలాలను సూచించే అస్ట్రాలజీ అప్లికేషన్‌ను డివైజ్‌లో లోడ్ చేశారు. మెమరీ 8జీబి. మార్కెట్లో ఛాజ్ C333 ధర రూ.3,500 ఉండొచ్చని మార్కెట్ వర్గాల అంచనా.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot