వోల్డ్ ఈజ్ గోల్డ్.. పాత హిరో, కొత్తు లుక్!!

Posted By: Super

వోల్డ్ ఈజ్ గోల్డ్.. పాత హిరో, కొత్తు లుక్!!

 

నమ్మకమైన బ్రాండ్ నోకియా తన పాత మోడల్ హ్యాండ్‌సెట్‌ను గుర్తు చేస్తూ కొత్త తరహాలో మరో ఫోన్‌ను డిజైన్ చేసింది. ఈ మొబైల్ పేరు నోకియా 1.3. సాధారణ వినియోగానికి ఆమోదయోగ్యమైన ఈ డివైజ్ ఉత్తమ ఫీచర్లను ఒదిగి ఉంది. వాటి వివరాలు క్లుప్తంగా:

డిస్‌ప్లే 1.36 అంగుళాలు, క్యాండీ బార్ డిజైన్, బరువు 76 గ్రాములు, 500 ఎంట్రీలను సపోర్ట్ చేసే ఫోన్ బుక్, 2జీ (జీఎస్ఎమ్) నెట్‌వర్క్ సపోర్ట్, ప్రీలోడెడ్ గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో, ఆడియో జాక్, లౌడ్ స్పీకర్, 800ఎమ్ఏహెచ్ లయోన్ బ్యాటరీ, స్టాండ్‌బై 648 గంటలు, టాక్‌టైమ్ 11 గంటలు, ధర రూ.1100.

ఫోన్ ప్రధాన ఆకర్షణ బ్యాటరీ బ్యాకప్, యూజర్‌ను ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. హ్యాండ్‌సెట్‌లో అమర్చిన బ్యాటరీ 27 రోజుల స్టాండ్ బై నిస్తుంది. ఏర్పాటు చేసిన డస్ట్ ప్రూఫ్ కీప్యాడ్ వ్యవస్థ ఫోన్ జీవిత కాలాన్ని రెట్టింపుచేస్తుంది. అనువైన కీప్యాడ్ వ్యవస్థ సౌకర్యవంతమైన టైపింగ్‌కు సహకరిస్తుంది.స్టోరేజి అంశానికి వస్తే ఫోన్‌లో 250 ఎస్ఎమ్ఎస్‌లతో పాటు 500 ఫోన్ బుక్ ఎంట్రీలను స్టోర్ చేసుకోవచ్చు. ఏర్పాటు చేసిన ఎఫ్ఎమ్ రేడియో వ్యవస్థ మన్నికైన వినోదాన్ని చేరువచేస్తుంది. క్వార్టర్ -2 నాటికి ఈ డివైజ్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot