'మీడియా టెక్' భాగస్వామ్యంతో 'ఫేస్‌బుక్' ఎక్కడికో..

Posted By: Prashanth

'మీడియా టెక్' భాగస్వామ్యంతో 'ఫేస్‌బుక్' ఎక్కడికో..

 

ప్రస్తుతం సమాజంలో సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్స్ మన జీవితాలలో మమేకమైపోయాయి అంటే ఎటువంటి సందేహాం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఫేస్‌బుక్ యూజర్స్ 800మిలియన్లకి చేరుకున్నారు. వీటిని క్యాష్ చేసుకునేందుకు గాను పాపులర్ మొబైల్ కంపెనీలు సోషల్ నెట్ వర్కింగ్ అప్లికేషన్స్ వారివారి మొబైల్ ఫోన్స్‌లలో ఇమిడి కృతం చేస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా ప్రస్తుత రోజుల్లో ఫేస్‌బుక్ కొసం ప్రత్యేకంగా కొన్ని కంపెనీలు మొబైల్ ఫోన్స్‌ని రూపొందిస్తున్నాయి. హెచ్‌టిసి చాచా, హెచ్‌టిసి సాల్సా  మొబైల్ ఫోన్స్‌ని గనుక చూసినట్లేతే ప్రత్యేకంగా ఫేస్‌బుక్ కొసమే రూపొందించడం జరిగింది.

ఐతే ఇక్కడ మనం గనుక చూసినట్లేతే హెచ్‌టిసి చాచా, హెచ్‌టిసి సాల్సా  మొబైల్ ఫోన్స్‌ కొంచెం ఎక్కువ ఖరీదుని కలిగి ఉన్నాయి. దాంతో ఎవరైతే ఫేస్‌బుక్ యూజర్స్ ఉన్నారో వారు ఇంత ఖర్చు పెట్టి కొనాలంటే కొంచెం సంశయిస్తారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మొబైల్ తయారీదారులు బేసిక్ మోడల్ ఫోన్స్‌లలో కూడా ఈ ఫేస్‌బుక్ ఫీచర్‌ని ఇమిడికృతం చేయాలని ఆలోచనలో ఉన్నారు. ఇందులో భాగంగానే ఫేస్‌బుక్ కంపెనీ, మీడియో టెక్ అనే మరొ కంపెనీతో చేతులు కలిపింది. దీని వల్ల ఏమిజరుగుతుందంటే బేసిక్ మోడల్స్ లలో కూడా రానున్న రోజుల్లో ఫేస్‌బుక్‌ని అందించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇక మీడియా టెక్ విషయానికి వస్తే ఎలక్ట్రానిక్స్ పరికరాలైన డివిడి ప్లేయర్స్, ఆప్టికల్ స్జోరేజి లాంటి వాటికి చిప్ సెట్స్‌ని అందించే కంపెనీ. మీడియాటెక్ కంపెనీని మే 28, 1997లో స్దాపించడం జరిగింది. దీని ప్రధాన కార్యాలయం తైవాన్‌ ఉంది. ప్రపంచ వ్యాప్తంగా మనం చూసినట్లేతే మొబైల్ ఫోన్స్‌కి చిఫ్ సెట్స్‌ని అందించడంతో పాటు, సెమీ కండెక్టర్స్‌ని తయారు చేయడంలో మీడియాటెక్ రెండవ స్దానంలో ఉంది. 2010వ సంవత్సరానికి గాను బొల్డ్‌నెస్ బిజినెస్ అవార్డు, 2011వ సంవత్సరానికి గాను నేషనల్ టెలికమ్ అవార్డుని సొంతం చేసుకుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot