త్వరలో చవక ధర యాపిల్ ఐఫోన్: ఫీచర్లేంటి..?

Posted By:

ఇంటర్నెట్ మీడియాలో ఓ ఆసక్తికర వార్త హల్‌చల్ చేస్తోంది. టెక్ దిగ్గజం యాపిల్ చవక వర్షన్ యాపిల్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసేందుకు కసరత్తులు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చవక ధర ఐఫోన్‌ను యాపిల్ మార్కెట్లోకి తీసుకువచ్చినట్లయితే సామ్‌సంగ్ తరహాలోనే యాపిల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను శాసించగలదని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ప్రపంచానికి త్వరలో పరిచయం కాబోతున్న యాపిల్ చవక ధర ఐఫోన్ ఫీచర్ల పై అనేకు రూమర్లు వెబ్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తున్నాయి. వాటి వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు......

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

త్వరలో చవక ధర యాపిల్ ఐఫోన్: ఫీచర్లేంటి..?

1.) చైనాకు చెందిన ప్రముఖ టెక్ ఫోరమ్ ‘వుయ్‌ఐఫోన్'(WeiPhone) యాపిల్ చవక ధర ఐఫోన్‌కు సంబంధించి ఫోటోతో పాటు పేరును విడుదల చేసింది. ‘ఐఫోన్ మినీ'గా ఈ డివైజ్ మార్కెట్‌కు పరిచయం కాబోతుంది. రెడ్, బ్లాక్, బ్లూ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలో హ్యాండ్‌సెట్ లభ్యం కానుంది. ఐవోస్7 మొబైల్ ఆపరేటింగ్ సిస్టం పై ఫోన్ స్పందిస్తుంది.

 

ధర

ధర:

యాపిల్ ఉత్పత్తులకు సంబంధించి అనేక వివరాలను బహిర్గతం చేసిన సోనీ డిక్సన్ తాజాగా తన ట్వీట్‌లో చవక యాపిల్ ఐఫోన్‌కు సంబంధించి ధర వివరాలను పోస్ట్ చేసారు. ఐఫోన్ మినీ 16,32,64జీబి మెమరీ వేరియంట్‌లలో లభ్యం కాబోతుంది. ధరలు $349, $449, $549 .

 

హార్డ్‌వేర్

హార్డ్‌వేర్:

4 అంగుళాల స్ర్కీన్,
ఎల్ఈడి ఫ్లాష్,
లైట్నింగ్ కనెక్టర్.
ఈ స్పెసిఫికేషన్‌లను లీకైన ఫోటోలు ఆధారంగా తెలపటం జరిగింది.

 

కలర్ ఆప్షన్స్

కలర్ ఆప్షన్స్:

పలు రిపోర్టులు ఆధారంగా సేకరించిన వివరాల మేరకు చవక ధర యాపిల్ ఐఫోన్ మల్టిపుల్ కలర్ ఆప్షన్‌లలో లభ్యంకాబోతోంది. వాటి వివరాలు నావీ, గోల్డ్ ఆరెంజ్, వైట్, పింక్ ఇంకా గ్రీన్. చైనా టెక్‌ సైట్ వెల్లడించిన వివరాల మేరకు ఐఫోన్ మినీ రెడ్, బ్లాక్, బ్లూ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలో లభ్యం కానుంది.

 

ప్లాస్టిక్ బాడీ

ప్లాస్టిక్ బాడీ:

చవర ధర యాపిల్ ఐఫోన్ నిర్మాణంలో భాగంగా పాలికార్బోనేట్ ప్లాస్టిక్‌ను ఉపయోగించినట్లు సమాచారం.

 

విడుదల ఎప్పుడంటే..?

విడుదల ఎప్పుడంటే..?

చవక ధర యాపిల్ ఐఫోన్‌ను మార్కెట్లో ఈ ఏడాది మూడవ త్రైమాసికం నాటికి అంటే సెప్టంబర్‌లో అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశముందని పలు కథనాలు పేర్కొన్నాయి.

 

తయారీదారు ఫాక్స్‌కాన్

యాపిల్‌కు ప్రధాన కాంట్రాక్టు తయారీదారుగా ఉన్న ఫాక్స్‌కాన్ చవక ధర యాపిల్ ఐఫోన్ నిర్మాణ బాధ్యతలను స్వీకరించినట్లు సమాచారం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot