దేశంలో అత్యంత సరసమైన 5G మొబైల్ తొలి సేల్ ఎప్పుడంటే!

|

భారతదేశంలో లావా మొబైల్‌ కంపెనీ ఇటీవల అత్యంత సరసమైన 5G ఫోన్ లావా బ్లేజ్‌ 5G (Lava Blaze 5G) లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ స్మార్ట్‌ఫోన్ నవంబర్ 15 మధ్యాహ్నం 12 గంటలకు ఈ కామర్స్ సైట్ అమెజాన్ ద్వారా తొలి సేల్ ప్రారంభమవుతుంది అని లావా ప్రకటన తెలిపింది. లావా బ్లేజ్ 5G ఫోన్ మీడియా టెక్ డైమెన్‌సిటి 700 ప్రొసెసర్‌ ను కలిగి ఉంది. లావా బ్లేజ్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ AI- మద్దతు ట్రిపుల్‌ రియర్‌ కెమెరా సెట్‌అప్‌ని కలిగి ఉంది. ఇందులో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది.

 
దేశంలో అత్యంత సరసమైన 5G మొబైల్ తొలి సేల్ ఎప్పుడంటే!

లావా కంపెనీకి చెందిన కొత్త లావా బ్లేజ్ 5G స్మార్ట్‌ఫోన్‌ యొక్క తొలి సేల్ అమెజాన్ వెబ్‌సైట్‌ వేదికగా నవంబర్ 15న నుంచి ప్రారంభమవుతుంది. ఇక ఈ ఫోన్ ప్రారంభ 4GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ఎంపికను కలిగి ఉంది, దీని ధర రూ.10,999 గా ఉంది. కానీ ప్రారంభ ఆఫర్ కింద రూ.9999 ధరకు అందుబాటులో ఉండనుంది. ఈ ఫోన్ గ్లాస్‌ గ్రీన్‌ మరియు గ్లాస్‌ బ్లూ కలర్ ఆప్షన్లలో రానుంది. లావా బ్లేజ్ 5G స్మార్ట్‌ఫోన్‌లోని ఇతర ఫీచర్‌ల గురించి మరింత తెలుసుకుందాం.

ధర మరియు లభ్యత;

ధర మరియు లభ్యత;

లావా బ్లేజ్‌ 5G స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో 4GB RAM + 128GB స్టోరేజ్ మోడల్‌కు ప్రారంభ ఆఫర్‌గా రూ.9,999 ధరను కలిగి ఉంది. నవంబర్ 15న అమేజాన్‌లో ఫస్ట్‌సేల్ ప్రారంభం కానుంది. ఇక ఈ ఫోన్ గ్లాస్ బ్లూ మరియు గ్లాస్ గ్రీన్ కలర్ ఎంపికలలో కొనుగోలుకు అందుబాటులో ఉంచబడుతుంది.

డిస్‌ప్లే మరియు డిజైన్;

డిస్‌ప్లే మరియు డిజైన్;

లావా బ్లేజ్ 5G స్మార్ట్‌ఫోన్ 6.51-అంగుళాల HD+ IPS డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 720 x 1,600 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. ఇది 269ppi పిక్సెల్ సాంద్రతకు మద్దతు ఇస్తుంది. అంతేకాకుండా, ఈ డిస్ప్లే వైడ్‌వైన్ L1 సపోర్ట్‌ను కలిగి ఉంది. డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది.

ప్రొసెసర్‌  ఏది?
 

ప్రొసెసర్‌ ఏది?

లావా బ్లేజ్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ 7nm మీడియా టెక్ డైమెన్‌సిటి 700 SoC ప్రొసెసర్‌ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది ఆండ్రాయిడ్ 12 పై రన్ అవుతుంది. అలాగే 4 GB RAM మరియు 128GB ఇన్‌బిల్ట్ స్టోరేజ్ కలిగి ఉంది. అదనంగా RAM ను వర్చువల్గా 3GB వరకు విస్తరించవచ్చు, మొత్తం 7 GB వరకు విస్తరించబడుతుంది. అదనంగా మైక్రో SD కార్డ్ ద్వారా 256GB వరకు విస్తరించడానికి అవకాశం కల్పిస్తుంది.

కెమెరా సెన్సార్ ఎంత?

కెమెరా సెన్సార్ ఎంత?

లావా బ్లేజ్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ AI- మద్దతు ట్రిపుల్‌ రియర్‌ కెమెరా సెట్‌అప్‌ని కలిగి ఉంది. ఇందులో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది. ఇంకా 8 మెగాపిక్సెల్ సెన్సార్ సామర్థ్యం గల సెల్ఫీ కెమెరాను అందించింది. ఇక కెమెరా ఫీచర్స్‌లో AI, బ్యూటీ, ఫిల్టర్‌లు, GIF, HDR, మ్యాక్రో, మోషన్, నైట్, పనోరమా, పోర్ట్‌రేట్, స్లో మోషన్ టైమ్‌ల్యాప్స్ మరియు UHD వంటి విభిన్న ఫీచర్లు ఉన్నాయి.

బ్యాటరీ బ్యాక్‌అప్‌;

బ్యాటరీ బ్యాక్‌అప్‌;

లావా బ్లేజ్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ 5,000mAh సామర్థ్యం బ్యాటరీ బ్యాటరీని కలిగి ఉంది. ఇది సింగల్ ఛార్జ్‌లో 50 గంటల టాక్‌టైమ్ మరియు 25 రోజుల స్టాండ్‌బై టైం అందించబడుతుంది. ఇక కనెక్టివిటి ఎంపికలలో 5G, బ్లూటూట్ V5.1, GLONASS, 3.5mm ఆడియో జాక్, Wi-Fi 802.11 b/g/n/ac, GPRS మరియు USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Cheapest 5g smartphone Lava blaze 5g first sale starts from november 15th.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X