రూ.35 వేలకే ఐఫోన్ X, ఆపిల్ వ్యూహం ఇదే !

By Anil
|

టెక్ టైటాన్ యాపిల్ ప్రతిష్టాత్మకంగా మరో మూడు కొత్త మోడల్ ఐఫోన్‌లను మార్కెట్ లోకి తీసుకొరాబోతుంది. ఎప్పటికి అప్పుడు కొత్తగా ఆలోచించే యాపిల్ కంపెనీ ఈ సారి బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ పై దృష్టి సారించింది. అయితే ఈ ఫోన్స్ ఆండ్రాయిడ్ ఫోన్స్ లభించే బడ్జెట్ ధర లో కాకుండా యాపిల్ ఫోన్స్ లభించే బడ్జెట్ ధర లో ఉంటుంది. ఈ ఫోన్ల ధర సుమారు రూ.35,000 ఉండవచ్చు అని అంచన.ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఫోన్ డ్యూయల్ కెమెరా సెట్ అప్ తో కాకుండా సింగల్ కెమెరా తో మార్కెట్ లోకి రాబోతుంది. కాగా ఈ ఫోన్ ఐఫోన్ X యొక్క పోలికలు కలిగి ఉంటాయని మరో 12 నెలలో మార్కెట్ లోకి రాబోతుంది అని ఫోర్బ్స్ నివేదికను ఇచ్చింది.ఈ ఫోన్ల గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఓ స్మార్ట్ లుక్కేయండి.

 

డిజైన్:

డిజైన్:

ఈ ఫొన్ల డిజైన్ ఐఫోన్ X తరహాలో ఉంటుంది.అన్ని యాపిల్ ఫోన్ల మాదిరే బేజిల్ లెస్ డిజైన్ తో రాబోతుంది . ఐఫోన్ X కు పై భాగంలో ఉన్న నాచ్‌ మరియు పేస్ ఐడి సెట్ అప్ లాగే ఇందులో కూడా అదే విధంగా అమర్చారు.

డ్యూయల్ కెమెరా ఉండదు:

డ్యూయల్ కెమెరా ఉండదు:

ఈ స్మార్ట్ ఫోన్లలో డ్యూయల్ కెమెరా ఉండదు సింగల్ కెమెరాతో ఈ ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకొని రానున్నారు. అయితే ఐఫోన్ 8 కి వెనుక భాగం లో కెమెరా ఎలా ఉంటుందో అలా ఉండబోతుంది.

3డి టచ్ ఉండదు:

3డి టచ్ ఉండదు:

ఐఫోన్ వాడే ముఖ్య ఉద్దేశం ఆ ఫోన్ లోని ఫీల్ అదే ఇందులో మిస్ అవుతుంది,ఇందులో 3డి టచ్ ఉండదు.

భారీ డిస్‌ప్లే:
 

భారీ డిస్‌ప్లే:

6.1 ఇంచుల సైజ్ ఉన్న భారీ డిస్‌ప్లేను ఈ ఫోన్లలో ఏర్పాటు చేశారు.ఐఫోన్ X తో పోలిస్తే ఈ ఫోన్లు భారీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అయితే ఈ ఫోన్లను OLED డిస్‌ప్లే తో కాకుండా LCD డిస్‌ప్లే ను అమర్చారు.ఫోన్ల క్రింది భాగం లో సన్నని బెజిల్ ఉంటుంది.

చివరి మాటలు:

చివరి మాటలు:

ఈ ఫోన్ ఎప్పుడు లాంచ్ అవుతుందో అని ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు అయితే ఈ ఫోన్ మార్కెట్లో ఎలాంటీ ప్రకంపనలు సృష్టిస్తుందో వేచి చూడాలి.

Best Mobiles in India

English summary
Cheapest iPhone X is coming, could cost as low of Rs 35,000: Case Leak.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X