నోకియా ఫోన్లు... అత్యంత తక్కువ ధరకే !

Written By:

నోకియా..స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో ఈ పదం తెలియని వారు ఉండరు. కనెక్టింగ్ పీపుల్ అంటూ ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. ఆ కంపెనీ నుంచి వచ్చిన ప్రతి ఫోన్ అమ్మకాల్లో సంచలనం రేపింది. అలాంటి నోకియా ఫోన్లు తక్కువ ధరకే లభిస్తే.. ఓ స్మార్ట్ లుక్కేయండి.

జియో ఫోన్ బుక్ చేశారా..ఎప్పుడు వస్తుందో తెలుసుకోవాలా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Nokia 100

ధర రూ. 1300 నుంచి రూ. 1500 మధ్యలో
1.8 ఇంచ్ టిఎఫ్‌టి డిస్ ప్లేతో పాటు, 70 గ్రాముల బరువు దీని సొంతం. 110 x 45.5 x 14.9 mmగా చుట్టుకొలతలను కలిగి ఉంది. పవర్ పుల్ బ్యాటరీ బ్యాక్ అప్‌ని అందించేందుకు గాను ఇందులో BL-5CB 800 mAh Li-Ion బ్యాటరీని నిక్షిప్తం చేశారు. టాక్ టైమ్ 6 గంటలు. స్టాండ్ బై టైమ్ 600 గంటలు. ఇటీవల కాలంలో నోకియా బేసిక్ మోడల్స్‌లలో కూడా ఎంటర్టెన్మెంట్ ఫీచర్స్‌ని నిక్షిప్తం చేస్తుంది. నోకియా 100లో కూడా ఎంటర్టెన్మెంట్ కోసం ఎఫ్ ఎమ్ రేడియోని పోందుపరచడం జరిగింది. ఫ్లాష్ లైట్, క్యాలెండర్, అలారమ్ క్లాక్ మొదలగునవి ప్రత్యేకం.

Nokia 101

ధర రూ. 1000 నుంచి 1500 మధ్యలో
నోకియా 101చూడడానికి ఆర్డినరి ఫోన్ మాదిరే ఉన్నప్పటికీ హై ఎండ్ ఫీచర్స్ దీని సొంతం. నోకియా 101 మొబైల్ 128 X 160 ఫిక్సల్ డిస్ ప్లేతో పాటు 1.8 ఇంచ్ స్క్రీన్ సైజుని కలిగి ఉంది. నోకియా 101 మొబైల్ ఫోన్ బుక్లో 500 ఎంట్రీలను ఇమడింపచేసకోవచ్చు. దీనితో పాటు ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మొమొరీని 16జిబి వరకు విస్తరించుకునే వెసులుబాటు ఉంది. నోకియా 101 మొబైల్ ఫోన్‌లో కెమెరా లేకపోవడం యూజర్స్‌ని నిరాశకు గురిచేసే అంశం.నోకియా 101 మాత్రం డ్యూయల్ సిమ్‌లను సపోర్ట్ చేస్తుంది. వీటితో పాటు నోకియా 101లో ఎఫ్‌ఎమ్ రేడియో, గ్యాలరీ, ఎమ్‌పి3 ప్లేయర్ ప్రత్యేకం. మోటరోలా ఈఎక్స్ 109 మొబైల్ ఫోన్‌లో జిపిఆర్‌ఎస్, ఎడ్జి టెక్నాలజీలు ఉండడంతో ఇంటర్నెట్ బ్రౌజింగ్‌ని కూడా ఈజీగా చేసుకోవచ్చు. మొబైల్‌తో పాటు 3.5mm ఆడియో జాక్ ప్రత్యేకం.న్ని రకాల ఆడియో ఫార్మెట్ల సపోర్ట్.

Nokia 105

ధర రూ. 1138
ఫీచర్లు
నోకియా 105 విషయానికి వస్తే..పాలీ కార్పోనేట్ బాడీతో 1.8 అంగుళాల క్యూవీజీఏ డిస్‌ప్లేతో ఆకర్షణీయంగా ఉంది. ముఖ్యంగి ఇది 30+ సిరీస్ ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో ఎంతో పేరొందిన స్నేక్ జెన్‌జియా గేమ్ కూడా లోడ్ చేశారు. అలాగే 800 ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు 4 ఎంబీ ఇంటర్నల్ స్టోరేజి కూడా ఉంది.ఒక సారి చార్జీ చేస్తే 15 గంటల పాటు నిరాటంకంగా మాట్లాడవచ్చు. ఇఖ చార్జింగ్ పెడితే 31 రోజుల పాటు స్టాండ్ బైగా పనిచేస్తుంది. ఇక డ్యూయల్ సిమ్ వేరియంట్ లో అయితే 25 రోజుల పాటు బ్యాటరీ స్టాండ్ బై టైం ఇచ్చారు. ఇక ఇతర ఫీచర్ల విషయానికి వస్తే బిల్టిన్ ఎఫ్ఎం రేడియో, మైక్రో యూఎస్‌బీ చార్జర్, 3.5 ఎంఎం ఆడియో పోర్ట్ ఉన్నాయి.

Nokia 107

ధర రూ. 1500 నుంచి రూ. 2000 మధ్యలో
డ్యూయల్ సిమ్ ఫోన్, 1.8 అంగుళాల QVGA డిస్‌ప్లే, మైక్రోసిమ్ కార్డ్, 4జీబి ఇన్‌బుల్ట్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 16జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 1020ఎమ్ఏహెచ్ బ్యాటరీ (12 గంటల బ్యాకప్ సింగిల్ ఛార్జ్‌తో). అందుబాటులో ఉండే ఫోన్ కలర్లు: రెడ్, బ్లాక్ ఇంకా వైట్.ఇన్-బుల్ట్ ఎంపీ3 ప్లేయర్, బ్లూటూత్, బ్లూటూత్ 3.0 కనెక్టువిటీ.

 

 

Nokia 108

ధర రూ. 1500 నుంచి రూ. 2000 మధ్యలో
డ్యూయల్ సిమ్, 1.8 అంగుళాల టీఎఫ్టీ QVGA డిస్‌ప్లే, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 960ఎమ్ఏహెచ్ బ్యాటరీ. వీజీఏ క్వాలిటీ రేర్ కెమెరా, అందుబాటులో ఉండే ఫోన్ కలర్స్: రెడ్, ఎల్లో, బ్లాక్ ఇంకా సియాన్. ఇన్-బుల్ట్ ఎంపీ3 ప్లేయర్, బ్లూటూత్, బ్లూటూత్ 3.0 కనెక్టువిటీ.

nokia 109

ధర రూ. 2000 నుంచి రూ. 2500 మధ్యలో
1.8 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే రిసల్యూషన్ 128 x 160పిక్సల్స్, 16ఎంబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, నోకియా సిరీస్ 40 ప్లాట్‌ఫామ్, జీపీఆర్ఎస్/ఎడ్జ్ 2జీ, 800ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ (7.5 గంటల టాక్‌టైమ్, 790 గంటల స్టాండ్‌బై), బ్లాక్ ఇంకా సియాన్ కలర్ వేరియంట్స్.

Nokia 112

ధర రూ. రూ. 2000 నుంచి 2700 మధ్యలో
డ్యూయల్ సిమ్,
1.8 అంగుళాల స్ర్కీన్,
0.3 మెగాపిక్సల్ రేర్ కెమెరా,
64ఎంబీ ఇంటర్నల్ మెమెరీ,
స్టాండర్డ్ Li-ion 1020 mAh బ్యాటరీ (స్టాండ్ బై 637 గంటలు, టాక్ టైమ్ 10.5 గంటలు),
బ్లూటూత్,
మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్.
బరువు 3.03oz.

Nokia 114

ధర రూ. 2000 నుంచి 2700 మధ్యలో
బరువు ఇంకా చుట్టుకొలత: 80 గ్రాములు, 110 x 46 x 14.8మిల్లీ మీటర్లు, డిస్‌ప్లే: 1.8 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే, రిసల్యూషన్ 128 x 160పిక్సల్స్, స్టోరేజ్: 16ఎంబి ఇంటర్నల్ స్టోరేజ్, 64ఎంబి మాస్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకోవచ్చు. కెమెరా: 0.3 మెగాపిక్సల్ వీజీఏ రేర్ కెమెరా, ఆపరేటింగ్ సిస్టం: నోకియా సిరీస్ 40 ప్లాట్‌ఫామ్, కనెక్టువిటీ: డ్యూయల్ సిమ్, బ్లూటూత్ 2.1, జీపీఆర్ఎస్ ఇంకా ఎడ్జ్, బ్యాటరీ: 1020 ఎమ్ఏహెచ్ బీఎల్-5సీ బ్యాటరీ (టాక్‌టైమ్ 10.5గంటలు, స్టాండ్‌బై 637 గంటలు), అదనపు ఫీచర్లు: ట్విట్టర్ సర్వీస్, ఫేస్‌బుక్ సర్వీస్, విండోస్ లైవ్ మెసెంజర్, నోకియా చాట్, ఈజీ స్వాప్ ఫీచర్.

Nokia 130

ధర రూ. 1500 నుంచి 1800 మధ్యలో
నోకియా 130 విషయానికి వస్తే ఇది కూడా సేమ్ 1.8 అంగుళాల క్యూవీజీఏ డిస్‌ప్లేతో తో పాటు 8 ఎంబీల ఇంటర్నల్ స్టోరేజీ ఇచ్చారు. దీన్ని 32 జీబీ ల వరకూ మైక్రో ఎస్‌డీ కార్డుతో ఎక్స్‌పాండ్ చేసుకునే సౌకర్యం ఉంది. ఇక అలాగే దీని వెనుక భాగంలో కెమెరాతో పాటు బ్లూటూత్ సౌకర్యం కలిగిఉంది. బ్యాటరీ సామర్థ్యం విషయానికి వస్తే 1020 ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు 11.5 గంటల పాటు వీడియో ప్లేబాక్ కెపాసిటీ, అలాగే 44.5 గంటల ఎఫ్ఎం రేడియో, అలాగే ఎల్ఈడీ ఫ్లాష్ లైట్ ఏర్పాటు చేశారు.

Nokia 220

ధర రూ. 2000 నుంచి 2700 మధ్యలో
2.4 అంగుళాల కలర్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 240 x 240పిక్సల్స్), 1100ఎమ్ఏహెచ్ బ్యాటరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత, 2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (ఎఫ్ఎమ్ రేడియో, ఎడ్జ్, బ్లూటూత్ 3.0, యూఎస్బీ 2.0 కనెక్టువిటీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్).

Nokia 1280

ధర రూ. రూ. 1000 నుంచి 1500 మధ్యలో
2జీ నెట్‌వర్క్ సపోర్ట్, 1.4 అంగుళాల స్ర్కీన్,
ఆల్ఫాన్యూమరిక్ కీప్యాడ్,
ఎఫ్ఎమ్ రేడియో,
ఫ్లాష్ లైట్, స్పీకింగ్ అలారమ్ క్లాక్

12. నోకియా సీ2-01 (Nokia C2-01)

ధర రూ. రూ. 2000 నుంచి 3000 మధ్యలో
సిరీస్ 40 ఆపరేటింగ్ సిస్టం
2 అంగుళాల స్ర్కీన్, 3.2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా
ఆల్ఫాన్యూమరిక్ కీప్యాడ్, 2జీ ఇంకా 3జీ నెట్‌వర్క్ సపోర్ట్
జీపీఆర్ఎస్ ఇంకా ఎడ్జ్ కనెక్టువిటీ
ఎఫ్ఎమ్ రేడియో
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 16జీబికి పొడిగించుకునే సౌలభ్యత

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Cheapest Nokia Mobile Phones in India Read more at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot