చైనా ఫోన్లను చెత్త కుప్పలో పడేయండి !

పలు సంచలనాత్మక నిర్ణయాలతో అంతర్జాయ వాణిజ్యాన్ని పరుగులు పెట్టిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై మొబైల్ బాంబును ప్రయోగించారు.

|

పలు సంచలనాత్మక నిర్ణయాలతో అంతర్జాయ వాణిజ్యాన్ని పరుగులు పెట్టిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై మొబైల్ బాంబును ప్రయోగించారు.ఇకపై చైనా ఫోన్లు చెత్తకుప్పలో వేసుకోవాలనే కఠిన నిర్ణయానికి స్వాగతం పలికారు. అంతర్జాయ వాణిజ్యాన్ని ముఖ్యంగా చైనాను హడలెత్తిస్తున్న అమెరికా అధ్యక్షుడు ఈమేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా టెలికమ్యూనికేషన్ మార్కెట్ కు చైనా మొబైల్ సంస్థ అందిస్తున్న సర్వీసులపై నిషేధం విధించారు. ఏటీ అండ్ టీ, వెరిజోన్ తర్వాత ప్రపంచంలో ఇదే అతిపెద్ద సంస్థ కావడం గమనార్హం. దేశ భద్రత నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు.

బ్లాక్ చేసిన వారు మళ్లీ అన్‌బ్లాక్ లోకి, ఎఫ్‌బిలో మరో బగ్ !బ్లాక్ చేసిన వారు మళ్లీ అన్‌బ్లాక్ లోకి, ఎఫ్‌బిలో మరో బగ్ !

దేశ భద్రత నేపథ్యంలో..

దేశ భద్రత నేపథ్యంలో..

దేశ భద్రత నేపథ్యంలో తీసుకున్న ఈ కఠిన నిర్ణయంతో చైనా మొబైల్‌ ఆ దేశంలో ఆపరేట్‌ చేయడానికి వీలులేదు. దీంతో ఇకపై నుంచి అమెరికాలో చైనా ఫోన్లు మూగబోనున్నాయి.

చైనా మొబైల్‌ను అనుమతించకూడదని..

చైనా మొబైల్‌ను అనుమతించకూడదని..

నేషనల్‌ టెలికమ్యూనికేషన్‌ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ విడుదల చేసిన ప్రకటనలో ఫెడరల్‌ కమ్యూనికేషన్స్‌ కమిషన్‌కు చైనా మొబైల్‌ను అనుమతించకూడదని సూచించింది.

అమెరికా, చైనాపై తీసుకుంటున్న చర్యలు..

అమెరికా, చైనాపై తీసుకుంటున్న చర్యలు..

గత కొన్ని నెలలుగా అమెరికా, చైనాపై తీసుకుంటున్న చర్యలు తెలిసినవే. ముఖ్యంగా చైనా టెక్‌ కంపెనీలు తమ మేథోసంపత్తి హక్కులను దొంగలిస్తున్నాయంటూ ట్రంప్‌ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

 దోపిడీకి దారితీసే అవకాశం
 

దోపిడీకి దారితీసే అవకాశం

చైనా మొబైల్‌ దోపిడీకి దారితీసే అవకాశముందని, ఇది చైనా ప్రభుత్వ చెప్పుచేతల్లో నడుస్తుందని, దీంతో దేశ భద్రతాపరమైన సమస్యలు తలెత్తే అకాశముందని అమెరికా అథారిటీలు పేర్కొంటున్నాయి.

అమెరికా న్యాయ వ్యవస్థకు ప్రమాదాలు

అమెరికా న్యాయ వ్యవస్థకు ప్రమాదాలు

చైనా మొబైల్‌తో కార్యకలాపాలు పెరిగితే, అమెరికా న్యాయ వ్యవస్థకు ప్రమాదాలు పెరిగి, దేశ భద్రతా ప్రయోజనాలను పరిష్కరించుకోలేమని అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కామర్స్‌ కమ్యూనికేషన్స్‌, ఇన్‌ఫర్మేషన్‌ అసిస్టెంట్‌ సెక్రటరీ డేవిడ్‌ రెడ్ల్‌ చెప్పారు.

899 మిలియన్‌ మంది సబ్‌స్క్రైబర్లు

899 మిలియన్‌ మంది సబ్‌స్క్రైబర్లు

ప్రస్తుతం చైనా మొబైల్‌కు 899 మిలియన్‌ మంది సబ్‌స్క్రైబర్లున్నారు. ట్రంప్‌ తీసుకున్న నిర్ణయంపై చైనా మొబైల్‌ ఇంకా స్పందించలేదు.

వాషింగ్టన్‌, బీజింగ్‌ల మధ్య..

వాషింగ్టన్‌, బీజింగ్‌ల మధ్య..

చైనా మొబైల్‌పై నిషేధం వాషింగ్టన్‌, బీజింగ్‌ల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో వివాదాలు ముదురుతున్నట్టు తెలిసింది.

34 బిలియన్‌ డాలర్ల చైనా ఉత్పత్తులపై..

34 బిలియన్‌ డాలర్ల చైనా ఉత్పత్తులపై..

కాగా జూలై 6 నుంచి 34 బిలియన్‌ డాలర్ల చైనా ఉత్పత్తులపై కూడా టారిఫ్‌లు విధించేందుకు అమెరికా సిద్ధమవుతోంది. దీనికి తగ్గట్టు బీజింగ్‌ కూడా స్పందించనున్నట్టు ప్రకటించింది.

చైనా జాతీయ బ్యాంకులు కీలక నిర్ణయం

చైనా జాతీయ బ్యాంకులు కీలక నిర్ణయం

ఇదిలా ఉంటే చైనా జాతీయ బ్యాంకులు కీలక నిర్ణయం తీసుకున్నాయి. చైనా సెంట్రల్‌ బ్యాంక్‌ పీబీఓసీ కొసం ఫార్వర్డ్స్‌లో కొనుగోలు చేసిన డాలర్లను ఆ దేశ బ్యాంకులు వెంటనే విక్రయించేశాయి. ఈ నిర్ణయం ద్వారా డాలర్ విలువ తగ్గించి యెన్ విలువను పెంచుకునేందుకు చైనా పావులు కదుపుతోంది.

డాలర్లలో ట్రేడింగ్‌ను తగ్గించుకుంటూ..

డాలర్లలో ట్రేడింగ్‌ను తగ్గించుకుంటూ..

ప్రధానంగా డాలర్లలో ట్రేడింగ్‌ను తగ్గించుకుంటూ సొంత కరెన్సీ యెన్‌ను ప్రమోట్‌ చేసుకుంటూ చైనా ముందుకు వెళుతోంది. ఈ మధ్య చమురు కొనుగోళ్లకు యెన్‌ను ఉపయోగించడం మొదలుపెట్టింది.

డాలర్‌ ఆధిపత్యాన్ని..

డాలర్‌ ఆధిపత్యాన్ని..

దీంతో డాలర్‌ ఆధిపత్యాన్ని చైనా సవాలు చేసినట్లు అయింది. చైనా, రష్యాలు తమ వ్యాపార ఒప్పందాలను రూబుల్‌(రష్యా) యెన్‌(చైనా)లలో చేసుకొనేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాయి.

Best Mobiles in India

English summary
The US won’t let China Mobile operate in the country, citing risk to national security more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X