మొబైల్ అప్లికేషన్ మార్కెట్లో చైనా, అమెరికాని అధిగమించనుందా..?

Posted By: Super

మొబైల్ అప్లికేషన్ మార్కెట్లో చైనా, అమెరికాని అధిగమించనుందా..?

చైనా అత్యధిక జనాభా గల దేశం. చైనా ఎక్కువ సైనిక శక్తి గల దేశం. ఇలా చెప్పుకుంటే పోతే చైనా అమ్ముల పోదిలోకి మరొ కొత్త మైలురాయి వచ్చి చేరింది. ఆ మైలు రాయి ఏంటంటే 'ఫ్లర్రీ వెబ్‌సైట్' అందించిన సమాచారం ప్రకారం ఈ సంవత్సరం అప్లికేషన్ స్టోర్స్ ఎక్కువగా ప్రవేశపెట్టడమే కాకుండా, ప్రపంచంలో 'రెండవ అతి పెద్ద మొబైల్ అప్లికేషన్ మార్కెట్' గా అవతరించింది.

మొబైల్ అప్లికేషన్ మార్కెట్లో చైనా ప్రపంచ వ్యాప్తంగా రెండవ స్దానాన్ని కైవసం చేసుకొవడమే కాకుండా, 2011వ సంవత్సరంలో 10 మిలియన్ అప్లికేషన్స్‌ని అది కూడా కేవలం ఆండ్రాయిడ్, ఐవోఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రమేనని తెలిపింది. ఈ సంవత్సరం 870శాతం అప్లికేషన్ సెషన్ పెరగడం వల్ల చైనా మొట్టమొదటి స్దానంలో నిలవగా, రెండవ స్దానంలోఅర్జెంటినా 527శాతంతో నిలచింది. ఇక మూడవ స్దానాన్ని ఇజ్రాయిల్ కైవసం చేసుకోగా, నాల్గవ స్దానాన్ని ఇండియా కైవసం చేసుకుంది.

చైనా మొబైల్ మార్కెట్ అప్లికేషన్ ఇంత తక్కువ కాలంలో అభివృద్ది చెందడానికి ఆ దేశంలో ఉన్న మద్యతరగతి కుటుంబాల ఎఫెక్టేనని అన్నారు. ఇటీవల కాలంలో మార్కెట్లో స్మార్ట్ ఫోన్ హావా ఎక్కువగా కొనసాగుతుండడంతో, 1.4 బిలియన్ జనాభా స్మార్ట్ ఫోన్స్ వైపు మొగ్గు చూపడం జరిగిందన్నారు. దీనితో పాటు రాబోయే కాలంలో అమెరికా మొబైల్ అప్లికేషన్ స్టోర్ మార్కెట్‌ని చైనా అధిగమిస్తుందని ఫ్లర్రీ జోస్యం చెప్పింది.

అమెరికాలో తనకు 30 వేల మంది ఇంజినీర్లు దొరకలేదని, అందుకే చైనాలో తాను ఏడు లక్షల మంది ఉద్యోగుల్ని పెట్టుకోవాల్సి వచ్చిందని జాబ్స్‌ ఒబామాతో అన్నారు. అమెరికాలో ఉన్న విదేశీయుల్లో 70 శాతం మంది ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో డాక్టరేట్లు. మరో సగం మంది మాస్టర్స్‌ డిగ్రీలు చేసిన వాళ్లే. వాళ్లందర్నీ అమెరికాలోనే ఉండనిస్తే, దేశానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాపై విమర్శలు గుప్పించిన సందర్బం మనం ఇక్కడ గుర్తు చేసుకొవాలి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot