చైనా మొబైల్స్ దెబ్బకు భారత్ మొబైల్ మార్కెట్ విలవిల

By Super
|
Chinese Mobile Phone
దేశీయ పారిశ్రామిక రంగానికి పొరుగు దేశం చైనా సవాల్‌ విసురుతోంది. ఆర్థిక వృద్ధి రేటు ఎదుగు దల కోసం పారిశ్రామిక రంగాభివృద్ధే మార్గమని విశ్వసిస్తున్న భారత్‌కు చైనా కంపెనీలు అడుగడుగునా అడ్డుపడుతు న్నాయి. జనాభా పరంగా ప్రపంచ దేశాలలో చైనా తర్వాత రెండో స్థానంలో భారత్‌లో వ్యాపార పరంగా సహజంగానే మంచి అవకాశాలుంటాయి. ఈ విషయాన్ని ఇప్పటికే గమ నించిన విదేశాలు భారత్‌లో పెద్ద ఎత్తున వ్యాపార కార్యక లాపాలను సాగించేందుకు ముందుకొచ్చి కోట్లాది రూపా యల పెట్టుబడులను పెడుతున్నాయి. ఈ క్రమంలో దేశీ య సంస్థలకు విదేశీ సంస్థలకు పోటీ సైతం పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే విశ్వ వ్యాప్తంగా విస్తరించిన బహుళజాతి సంస్థలను ఎదుర్కోలేక దేశీయ సంస్థలు వెనకబడుతుండ టంతో ఇప్పటికే దేశీయ వ్యాపార రంగంలో విదేశీ సంస్థల హవా స్పష్టంగా కనిపిస్తోంది.

టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ అర చేతిలో విశ్వాన్ని చూ పించే స్థాయికి మొబైల్‌ ఫోన్ల తయారీ ఎదిగిపోయింది. అయితే ఈ మొబైల్‌ ఫోన్ల తయారీలో ప్రపంచానికే తలమానికంగా నిలుస్తున్న చైనీయులు..భారత్‌పై తమ దృష్టిని కేంద్రీకరించారు. మొబైల్‌ మార్కెట్‌కు ఎంతో డిమాండ్‌ ఉన్న భారత్‌లో చైనా ఉత్పత్తులు హల్‌చల్‌ సృష్టిస్తున్నాయి. చైనాలో కుటీర పరిశ్రమ స్థాయిలో సెల్‌ ఫోన్‌ తయారీ జరుగుతుండటంతో తక్కువ ధరకే మార్కెట్‌ లో లభించడం జరుగుతోంది. అంతేగాక మహా మహా కంపెనీల ఉత్పత్తులను తోసిపుచ్చే విధంగా డ్యూయెల్‌ సిమ్‌ , ఫొటో, వీడియో కెమెరాలు, ఇంటర్నెట్‌ సౌకర్యం, ఫోన్‌ మెమరీ ఫీచర్లను కలిగి ఉండటంతో చైనా మొబైల్స్‌కు భార త్‌లో భారీ అమ్మకాలు నమోదవుతున్నాయి.

దీంతో భారత్‌ లో అధికారికంగా టాక్స్‌లు చెల్లిస్తున్న మొబైల్‌ సంస్థలకు నష్టం వాటిల్లుతోంది. ఫలితంగా కొత్త సంస్థలు మార్కెట్‌ లోకి ప్రవేశించడం మానేయగా, మరికొన్ని సంస్థలు టాక్స్‌ ల పరంగా రాయితీని పొందే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఏటా ఖజనాకు రావాల్సిన కోట్లాది రూపాయల ఆదాయం చేజారిపోతోంది. అయితే దీనిపై స్పందించిన భారత్‌ చైనా మొబైల్స్‌పై నిషేధం విధించడమేగాక ఇంటర్నేషనల్‌ మొబై ల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ (ఐఎమ్‌ఈఐ) నెంబర్‌ విషయం లో కఠిన నిబంధనలను విధించింది. ఫలితంగా ప్రస్తుతం చైనా మొబైల్‌ల వెల్లువకు భారత మార్కెట్‌లో అడ్డుకట్ట పడినట్లైంది.

చైనా ఉత్పత్తుల ద్వారా పారిశ్రామికంగా ఏటా కోట్లాది రూపాయల ఆదాయాన్ని, పారిశ్రామికాభివృద్ధిని భారత్‌ కోల్పోతోంది. ఆసియా ఖండంలో అన్ని విషయాలలో చైనా కు ప్రధాన పోటీదారుగా నిలుస్తున్న భారత ఆర్థికాభివృద్ధిని దెబ్బ తీయాలని చైనా వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. ఈ క్రమంలోనే దేశీయంగా తయారైన పలు ఉత్పత్తులను భారత్‌కు అక్రమంగా తరలించడమేగాక వాటికి పన్నుల పరంగా మినహాయింపునిస్తోంది. దీంతో భారత్‌లోని ఆయా పరిశ్రమలకు తీవ్రంగా ఆర్థిక నష్టం వాటిల్లుతోంది. దీంతో చైనాకు మరింత పటిష్ఠంగా కళ్ళెం వేయకపోతే మున్ముందు భారత్‌కు కష్టాలు తప్పవని పలువురు ఆర్థిక, మార్కెట్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X