ఇండియాలో చైనీస్ ఐఫోన్ 5ని త్వరలోనే ప్రవేశపెడతాం...

By Super
|
Chinese rival for iphone5
చైనీస్ ఎప్పుడూ కూడా కొత్త టెక్నాలజీని కనిపెట్టడంలో ముందు ఉంటారు. అంతేకాదండోయ్ ఎదుటి వారి కంపెనీకి సంబంధించిన ఎటువంటి హ్యాండ్ సెట్స్ నైనా అతి తక్కువ కాలంలో అతి తక్కువ ధరలో చైనాలో విడుదల చేయడం జరుగుతుంది. చైనా మొబైల్ గెయింట్ ఆర్గనైజేషన్ అయిన షెన్‌జాన్ శాంగ్ ఫీ వినియోగదారుల కమ్యూనికేషన్ సంస్ద ఇండియాని టార్గెట్ చేసుకొని స్మార్ట్ ఫోన్స్‌ని విడుదల చేసేందుకు సిద్దమైంది.

గతంలో ఫిలిఫ్స్ మొబైల్ ఫోన్ బిజినెస్‌ని సొంతం చేసుకున్న కంపెనీయే ఈ షెన్‌జాన్ శాంగ్ ఫీ ఆర్గనైజేషన్. ఫిలిప్స్ పేరుతో మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్స్‌ని విడుదల చేయనున్నారు. ఇండియాలో వీరు విడుదల చేయదలచుకున్న స్మార్ట్ పోన్స్ యొక్క ధర ఎంతవరకు ఉంటే సక్సెస్ అవుతాయో ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే చైనా స్మార్ట్ ఫోన్స్ గురించి మార్కెట్లో మంచి హైప్‌ని క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.ఇది మాత్రమే కాకుండా చైనా మొబైల్స్ ఇండియాలో ఉన్న సామాన్య ప్రజలకు ఎంత చేరువ అయ్యాయో అందరికి తెలిసిందే.

 

త్వరలోనే షెన్‌జాన్ శాంగ్ ఫీ విడుదల చేయనున్న స్మార్ట్ ఫోన్స్‌లలో ఇప్పటికే మార్కెట్లో వాటికంటూ మంచి పేరు తెచ్చుకున్న శ్యామ్ సంగ్ గెలాక్సీ సిరిస్ మొబైల్స్ మాదిరి మొబైల్స్‌ని విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే ఇంతవరకు మార్కెట్లో విడుదలవనటువంటి ఐపోన్ 5 మాదిరి స్మార్ట్ ఫోన్‌ని కూడా ఈ షెన్‌జాన్ శాంగ్ ఫీ ఆర్గనైజేషన్ విడుదల చేయనుంది. ఫిలిఫ్స్ ఎక్స్ 9320 స్మార్ట్ ఫోన్ యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను 4.3 ఇంచ్ టచ్ స్క్రీన్ డిస్ ప్లేని కలిగి ఉండడంతో పాటు, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ వర్సన్ 2.3 జింజర్ బ్రెడ్‌తో రన్ అవుతుంది.

 

ఇండియాలో ప్రస్తుతం డ్యూయల్ సిమ్ ఫీవర్ ఎక్కవగా ఉండడంతో ఇందులో డ్యూయల్ సిమ్ ఫీచర్‌ని కూడా నిక్షిప్తం చేయడం జరిగింది. వీటితో పాటు ఫిలిఫ్స్ ఎక్స్ 9320 స్మార్ట్ ఫోన్ ముందు, వెనుక భాగాలలో కెమెరాలను అనుసంధానం చేయడం జరిగింది. ముందు భాగాన ఉన్న కెమెరాతో వీడియో కాలింగ్ ఫీచర్‌ని అందుబాటులోకి తేగా, వెనుక వైపు ఉన్న కెమెరాతో చక్కని ఇమేజిలను తీయవచ్చు. ఎంటర్టెన్మెంట్ విషయంలో కూడా యూజర్స్‌కు ఎటువంటి నిరాశను కలగజేయదు. మార్కెట్లో లభ్యమయ్యే అన్ని రకాల ఆడియో, వీడియో ఫార్మెట్లను సపోర్ట్ చేస్తుంది.

ఇటీవల కాలంలో మార్కెట్లోకి విడుదలైన ఫిలిప్స్ మొబైల్స్ మంచి బ్యాటరీ బ్యాక్ అప్‌ని కూడా అందిస్తున్నాయి. ఫిలిఫ్స్ ఎక్స్ 9320 స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే కంటిన్యూగా మాట్లాడితే 15గంటల పాటు బ్యాటరీ వస్తుంది. ఈ కొత్త ఫిలిప్స్ స్మార్ట్ పోన్‌ని ఇండియాలో దీపావళికి విడుదల చేయనున్నట్లు తెలిపారు. అధునాతన ఫీచర్స్ కలిగినటువంటి ఈ మొబైల్ ధర సుమారుగా ఇండియన్ మార్కెట్లో రూ 8,500గా ఉండవచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X