ఇండియాలో 'ఉస్తాద్' తడాఖా...

Posted By: Super

ఇండియాలో 'ఉస్తాద్' తడాఖా...

 

ఇండియాలో ఉన్న కామన్ మ్యాన్‌కి ఎటువంటి మొబైలైతే ఖచ్చితంగా సరిపోతుందో అలాంటి మొబైల్‌‍నే మార్కెట్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంది ఐవికె మొబైల్ సంస్ద. ముఖ్యంగా ఇండియాలో ఉన్న మాస్ జనాభాని దృష్టిలో పెట్టుకొని విడుదల చేస్తున్న ఈ మొబైల్ పేరు 'ఛోటా ఉస్తాద్ ఐవి192'. ఈ మొబైల్ ప్రత్యేకతలు గ్యారంటీగా ఇండియాలో ఉన్న సగటు మనిషికి నచ్చుతాయి.

డ్యూయల్ సిమ్, డ్యూయల్ బ్యాండ్‌ని కలిగి ఉన్న ఛోటా ఉస్తాద్ ఐవి192 మొబైల్‌లో ఎంటర్టెన్మెంట్ కొసం వైర్ లెస్ ఎఫ్‌ఎమ్ రేడియో, ఎఫ్ ఎమ్ రేడియో కొసం ప్రత్యేకంగా రూపొందించిన డెడికేటెడ్ 'ఎఫ్‌ఎమ్ కీ'తో పాటు పెద్ద స్పీకర్స ప్రత్యేకం. వీటితో పాటు ఛోటా ఉస్తాద్ ఐవి192 మొబైల్ సగటు మనిషికి బ్లూటూత్ A2DPని బ్లూటూత్ హెడ్ కొసం సపోర్ట్ చేస్తుంది. మార్కెట్లో లభించే ఆడియో, వీడియో AMR, MIDI, WAV, MP3 లాంటి ఫార్మెట్లను సపోర్ట్ చేస్తుంది.

యూజర్స్‌ని రేడియేషన్ నుండి కాపాడేందుకు గాను ఇందులో కాల్ కనెక్ట్ నోటీస్ ప్రొటెక్టింగ్ ఫీచర్ ప్రత్యేకం. 'ఛోటా ఉస్తాద్ ఐవి192' మొబైల్ 1.3 మెగా ఫిక్సల్ కెమెరాని కలిగి ఉంది. అన్ని మొబైల్ ఫోన్స్ మాదిరే వెలుగు కొసం ఇందులో కూడా టార్చ్‌ని అమర్చడం జరిగింది. ఎల్‌సిడి డివైజ్ అవడమే కాకుండా, రెండు ఛార్జింగ్ పోర్ట్‌లు దీని సొంతం. మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా మెమరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మెమరీని 16జిబి వరకు విస్తరించుకొవచ్చు.

పవర్‌పుల్ బ్యాటరీ బ్యాక్‌అప్‌ని అందించేందుకు గాను ఇందులో 1450 mAh బ్యాటరీని నిక్షిప్తం చేయడం జరిగింది. బ్యాటరీ టాక్ టైమ్ 10 గంటలు. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను దీని స్క్రీన్ సైజు 2 ఇంచ్‌లుగా రూపొందించడం జరిగింది. ఇండియన్ మొబైల్ మార్కెట్లో దీని ధరను ఇంకా వెల్లడించ లేదు. మొదటగా జపాన్‌లో విడుదలైన ఛోటా ఉస్తాద్ ఐవి192 మొబైల్‌ని అమెరికాలో విడుదల చేసేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot