ప్రేమ మూర్తి పండుగకు వ్యాపారం మెరిసేనా..?

Posted By: Staff

ప్రేమ మూర్తి పండుగకు వ్యాపారం మెరిసేనా..?

 

క్రిస్టమస్‌కు నిర్వచనం క్రీస్తు జననం. ఈ లోక ప్రజలకు పాప విముక్తి కలిగించటానికి ఏసు క్రీస్తు దివి నుంచి భువికి దిగివచ్చిన ప్రేమ మూర్తి అని క్రైస్తవుల ప్రగాడ విశ్వాసం. క్రిస్టమస్ క్రేస్తవులకి చాలా ముఖ్యమైన పండగ. ఏటా డిసెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా క్రిస్టమస్ సంబరాలు అంబరాన్ని తాకుతాయి. పాశ్చాత్య దేశాల్లో ఇప్పటికే క్రిస్టమస్ సందడి మొదలైంది. మన దేశంలోని క్రైస్తవ మందిరాలు ఇప్పటికే పండుగ శోభను సంతరించుకున్నాయి. ఈ పండుగకు ప్రతి ఒక్కరూ నూతన వస్త్రాలు ధరించి చర్చీలకు వెళ్లి ప్రార్థనలు చేసి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుకుంటారు. క్రైస్తవులు షాపింగ్‌లో బిజీగా ఉన్నారు. కుల, మతాలు వేరైనప్పటికీ మానవులందరికి దేవుడు ఒక్కడేనని చేప్పే పండుగగా భక్తులు భావిస్తారు.

పండుగ మార్కెట్:

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ల చూపంతా క్రిస్టమస్ పండుగ పైనే, కారణం కోట్లలో వ్యాపారం ఈ సీజన్‌లో జరగుతుంది. దుస్తులు మొదలుకుని అన్ని రకాలు వస్తువులు ఈ సీజన్‌లో అత్యధికంగా అమ్ముడవుతాయి. ఇప్పటికు పలు జ్యూయలరీస్, వస్త్ర దుకాణాలు,

షో రూమ్స్, షాపింగ్ మాల్స్ క్రిస్టమస్ ఆఫర్లంటూ ప్రకటనలు గుప్పిస్తున్నాయి. మొబైల్, కంప్యూటింగ్ ఇతర ఎలక్ట్రానిక్ వస్తు మార్కెట్లో ప్రముఖ బ్రాండ్లైన బ్రాండ్లైన శ్యామ్‌సంగ్, ఎల్‌జీ, తోషిబా, లెనోవో, నోకియా, మోటరోలా, హెచ్‌పీ, డెల్, అసస్‌లు ఇప్పటికే క్రిస్టమస్ మోడళ్లను ఆఫర్ ధరలతో మార్కెట్లో విడుదల చేశాయి.

ప్రస్తుతం పలు దేశాల్లో నెలకున్న ఆర్ధిక సంక్షోభం క్రిస్టమస్ వ్యాపారానికి అవరోధంగా నిలిచింది. ఈ అంశం పైనే పలు వ్యాపార సంస్థలు అందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting