Amazon లో ఈ ఫోన్లపై క్రిస్మస్ ఆఫర్లు ! ఫోన్ కొనాలంటే ఇదే అవకాశం.

By Maheswara
|

అమెజాన్ ఈ నెల అంటే డిసెంబర్ 22 నుండి డిసెంబర్ 25 వరకు ఫ్యాబ్ ఫోన్ ఫెస్ట్ అమ్మకాలను నిర్వహిస్తోంది. ఈ అమ్మకాలలో స్మార్ట్‌ఫోన్‌లపై 40% వరకు తగ్గింపు, వడ్డీ లేని EMI చెల్లింపులు మరియు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌ మొదలగు ఆఫర్లను అందిస్తుంది. అంతేకాకుండా,HDFC బ్యాంక్ కార్డు వినియోగదారులకు రూ.1,500 తక్షణ తగ్గింపు ఆఫర్ కూడా ఉంది. అలాగే, ఈ తక్షణ డిస్కౌంట్ ఆఫర్ EMI చెల్లింపు ఎంపికపై కూడా వర్తిస్తుందని గమనించగలరు.

అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్
 

వీటితో పాటు, అమెజాన్ ఇంకా అనేక బ్రాండ్ల స్మార్ట్ఫోన్ల పై కూడా అమ్మకాలను నిర్వహిస్తుంది. ఇప్పుడు జరుగుతున్న జబ్ర డేస్ సేల్ లో కూడా ఆఫర్ ఉన్నాయి. ఈ ఆఫర్లు డిసెంబర్ 17 న ప్రారంభమై క్రిస్మస్ వరకు కొనసాగుతాయి. ఈ అమ్మకం సమయంలో, అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సందర్భంగా మీరు కొనుగోలు చేసే స్మార్ట్‌ఫోన్‌తో మీరు ఉపయోగించగల జబ్ ఉత్పత్తులపై 70% వరకు తగ్గింపు పొందవచ్చు.వివిధ ఫోన్ల పై ఉన్న ఆఫర్లను, వాటి ధరలను చూడండి.మేము ఇక్కడ ఇస్తున్న ఆఫర్లు అన్ని అమెజాన్ నుంచి సేకరించడమైనది.

Samsung Galaxy M51

Samsung Galaxy M51

శామ్‌సంగ్ గెలాక్సీ M51 స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి, ఆండ్రాయిడ్ 10 వన్ UI కోర్ 2.1 తో రన్ అవుతుంది. ఇది 6.7-అంగుళాల ఫుల్- HD + సూపర్ అమోలెడ్ ప్లస్ ఇన్ఫినిటీ ఓ డిస్‌ప్లేను 20: 9 కారక నిష్పత్తితో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో వస్తుంది. అలాగే ఈ ఫోన్‌ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730G SoC తో రన్ అవుతూ 8GB ర్యామ్ తో ఈ ఫోన్ విడుదల అయింది.ఇందులో F/1.8 లెన్స్‌తో 64 మెగాపిక్సెల్ సోనీ IMX682 సెన్సార్‌ ప్రైమరీ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ షూటర్ సెకండరీ కెమెరా, 5 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ మరియు 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో కెమెరాలు జతచేయబడి ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో చాట్ కోసం స్మార్ట్‌ఫోన్ ముందు భాగంలో F/ 2.2 లెన్స్‌ సెన్సార్‌తో 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.అలాగే ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు రివర్స్ ఛార్జింగ్ మద్దతుతో 7,000mAh పెద్ద బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

Also Read:ధర రూ.10,000 ల లోపు ఉన్న ఫోన్లపై భారీ ఆఫర్లు!

Oneplus 8T
 

Oneplus 8T

6.5-అంగుళాల ఫ్లూయిడ్ అమోలేడ్ ప్యానెల్‌ తో, ఇది 1080 x 2400 పిక్సెల్స్ FHD+ రిజల్యూషన్, 402 ppi పిక్సెల్ డెన్సిటీ, 20: 9 కారక నిష్పత్తిని కలిగిన డిస్ప్లే ని అందిస్తుంది.కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణ, 120Hz అధిక రిఫ్రెష్ రేటుతో వస్తుంది. ఫోన్ వెనుక ప్యానెల్ లో 48MP ప్రాధమిక సెన్సార్‌ను f /1.8 Aperture మరియు 16MP అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్‌ కలిగి ఉంటుంది. 5MP మాక్రో సెన్సార్ మరియు 2MP డెప్త్‌సెన్సర్ కెమెరా సెటప్‌ను పూర్తి చేస్తుంది.12GB RAM, 256GB స్థానిక నిల్వ సామర్థ్యం తో ఆండ్రాయిడ్ 11 పై పనిచేస్తుంది.ఈ ఫోన్ 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ బ్యాటరీ తో వస్తుంది.

Samsung Galaxy M31s

Samsung Galaxy M31s

ఈ ఫోన్ 6.5-అంగుళాల ఫుల్ HD + సూపర్ AMOLED డిస్ప్లేను గరిష్టంగా 420 నిట్స్ ప్రకాశంతో కలిగి ఉంటుంది.ఆండ్రాయిడ్ 10 ను One UI మరియు ఎక్సినోస్ 9611 SoC చేత రన్ అవుతూ 6GB మరియు 8GB RAM తో జతచేయబడి వస్తుంది. అలాగే ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ తో 6,000mAh బ్యాటరీతో తయారు చేయబడింది.కెమెరా సెటప్ విషయానికి వస్తే ఫోటోలు మరియు వీడియోల కోసం ఈ ఫోన్ వెనుకభాగంలో క్వాడ్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో 64 MPప్రైమరీ కెమెరా సోనీ IMX682 సెన్సార్‌ మరియు 12 MP సెకండరీ కెమెరా 123-డిగ్రీల అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ ను కలిగి ఉంది . అలాగే కెమెరా సెటప్‌లో 5 మెగాపిక్సెల్ డెప్త్ షూటర్ మరియు 5 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కెమెరాలు జతచేయబడి ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాల్‌ల కోసం ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

Oppo A12

Oppo A12

OPPO A12 స్మార్ట్‌ఫోన్ 6.22-అంగుళాల (1520 × 720 పిక్సెల్‌లు) హెచ్‌డి + డిస్ప్లే వాటర్‌డ్రాప్ నాచ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో డిస్ప్లే ని కలిగి ఉంది.ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో పి 35 12 ఎన్ఎమ్ ప్రాసెసర్ (ARM కార్టెక్స్ A53 CPU)ప్రాసెసర్ పైన పనిచేస్తుంది.

OPPO A12 స్మార్ట్‌ఫోన్‌ యొక్క వెనుక భాగంలో 13MP మరియు 2MP సెన్సార్ లతో డ్యూయల్ కెమెరాలు ఉన్నాయి. అంతేకాకుండా 2MP డీప్ కెమెరా ప్రతి షాట్‌ను DSLR ఇమేజ్ లాగా చేస్తుంది. 4230mAh బ్యాటరీ తో వస్తుంది.

Also Read:రూ.15,000 లోపు బడ్జెట్ ధరలో లభించే బెస్ట్ కొత్త స్మార్ట్‌ఫోన్‌లు ఇవే...

Redmi 9 Prime

Redmi 9 Prime

Redmi 9 Prime స్మార్ట్‌ఫోన్‌ 6.53-అంగుళాల ఫుల్-హెచ్‌డి + డిస్‌ప్లేను 19.5: 9 కారక నిష్పత్తితో మరియు 394ppi పిక్సెల్ డెన్సిటీతో 400 నిట్స్ బ్రైట్ నెస్ తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో G80 ప్రాసెసర్ మరియు మాలి-G52 GPU మద్దతుతో వస్తుంది. ఇందులో గల మైక్రో SD కార్డ్ స్లాట్‌ ద్వారా మెమొరిని మరింత విస్తరించవచ్చు.ఇందులో 13మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 5 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కెమెరా మరియు 2 మెగాపిక్సెల్ డీప్ సెన్సార్ కెమెరాలు అమర్చబడి ఉన్నాయి. అలాగే ఫోన్ యొక్క ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.ఈ రెడ్‌మి ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,020mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Christmas Offers On Smartphones: Amazon Fab Phones Fest Offers, Check List And Prices 

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X