మీ స్మార్ట్‌ఫోన్‌ను క్లీన్ చేస్తున్నారా..? ఏం చేయాలి, ఏం చేయకూడదు
నేటి ఆధునిక కమ్యూనికేషన్ ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్‌లేని జీవితాన్ని మనం ఎంత మాత్రం ఊహించుకోలేపోతున్నాం.
నేటి ఆధునిక కమ్యూనికేషన్ ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్‌లేని జీవితాన్ని మనం ఎంత మాత్రం ఊహించుకోలేపోతున్నాం. మనుషుల వ్యక్తిగత జీవితాలతో అంతలా మమేకమవుతోన్న ఈ డివైస్ రోజుకో కొత్త ఫీచర్‌తో కమ్యూనికేషన్ అవసరాలను మరింత సులభతరంగా తీర్చగలుగుతోంది. స్మార్ట్‌ఫోన్‌లను స్టేటస్ సింబల్‌గా భావిస్తోన్న కొందరు తమ డివైస్‌ను ఎప్పుడు నిత్యనూతనంగా ఉంచుకునేందుకు తాపత్రయ పడుతున్నారు. ఈ క్రమంలో తమ డివైస్ క్లిన్‌గా ఉండేదుకు అవసరమైన అన్ని జాగ్రత్తలను వీరు తీసుకుంటున్నారు. నాణానికి ఓ వైపు ఈ విధంగా ఉంటే మరోవైపు మాత్రం పూర్తి భిన్నంగా ఉంది.

స్మార్ట్‌ఫోన్ క్లీనింగ్ పెనుభారం కాదు..
స్మార్ట్‌ఫోన్‌ల నిర్వహణ విషయాన్ని చాలామంది నిర్లక్ష్యంగా తీసుకుంటున్నట్లు ఓ అధ్యయనంలో వెల్లడయ్యింది. స్మార్ట్‌ఫోన్ క్లీనింగ్ వ్యవహారాన్ని వీరో పెద్దపనిగా భావిస్తున్నట్లు తెలిసింది. వాస్తవానికి స్మార్ట్‌ఫోన్ క్లీనింగ్ అనేది సింపుల్ ట్రిక్స్‌తో కూడుకున్న విషయం. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా స్మార్ట్‌ఫోన్ క్లినింగ్ విషయంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్నదాని పై పలు ఆసక్తికర వివరాలను మీతో షేర్ చేసుకోవటం జరుగుతోంది..

స్మార్ట్‌ఫోన్‌లను క్లీన్ చేసే సమయంలో చేయవల్సిన పనులు..
ముందుగా ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసి బ్యాటరీని తొలగించాలి. మీ ఫోన్ నాన్ రిమూవబుల్ బ్యాటరీతో వచ్చినట్లయితే టర్నాఫ్ చేస్తే సరిపోతుంది. ఫోన్‌ను క్లీన్ చేసే సమయంలో మీరు కూర్చునే ఉండాలి. నిలబడి ఉండకూడదు. ప్రొటెక్టివ్ కేస్‌లు ఏమైనా ఉంటే వాటిని రిమూట్ చేసేయండి. స్ర్కీన్‌ను క్లీన్ చేసే విషయంలో డ్రై కాటన్ క్లాత్‌ను వినియోగించండి. అంచుల్లో పేరుకుపోయిన దుమ్మును తొలగించే క్రమలో సాఫ్ట్ బ్రష్‌ను ఉపయోగించండి.

తడి వస్త్రంతో తుడిచిన వెంటనే పొడి వస్త్రంతో..
ఫోన్ వెనుక భాగాన్ని క్లీన్ చేసేందుకు తడిగా ఉండే వస్త్రాన్ని ఉపయోగించండి. తడి వస్త్రంతో తుడిచిన వెంటనే పొడి వస్త్రంతో ఆ ప్రదేశాన్ని తుడవండి. ఫోన్ ఛార్జింగ్ పోర్ట్, స్పీకర్స్ అలానే ఆడియో పోర్టులను క్లీన్ చేసేందుకు సాఫ్ట్ బ్లోవర్‌ను ఉపయోగించండి. ఫోన్ ఫ్రంట్ ఇంకా బ్యాక్ కెమెరాలను క్లీన్ చేసేందుకు ముందు తడి వస్త్రాన్ని ఉపయోగించి ఆ తరువాత పొడి వస్త్రాన్ని ఉపయోగించండి. క్లీనింగ్ ప్రాసెస్ పూర్తి అయి, ఫోన్ డ్రై అయ్యేంత వరకు టర్న్ ఆన్ చేయకండి.

స్మార్ట్‌ఫోన్‌లను క్లీన్ చేసే సమయంలో చేయకూడని పనులు..
ఫోన్‌ను క్లీన్ చేసేందుకు పూర్తిగా తడి వస్త్రాన్ని ఉపయోగించకూడదు. ఫోన్ స్ర్కీన్ పైకి నేరుగా లిక్విడ్‌ను స్ప్రే చేయకూడదు. ఈ చర్య చాలా ప్రమాదకరమైనది. ఫోన్ పూర్తిగా డ్యామెజ్ అవ్వొచ్చు. ఫోన్ ను క్లీన్ చేసే సయమంలో కూర్చొనే ఉండాలి. నిలబడి ఉండకూడదు. నిలుచొని ఉండటం ఫోన్ క్రిందకు జారి పడే ప్రమాదం ఉంది. ఫోన్ లను క్లీన్ చేసే సమయంలో పొదునైన వస్తువులను ఉపయోగించవద్దు. మీరు సొంతంగా తయారుచేసుకున్న కెమికల్స్ ను ఫోన్ క్లీనింగ్ విషయంలో ఉపయోగించకండి.


Click it and Unblock the Notifications








